Vivo V20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది!!! ధర ఎంతో తెలుసా!!

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన వివో V20 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ వివో V20 ప్రోను ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ చేసారు. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 5G కనెక్టివిటీ, స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో V20 ప్రో 5G ధరలు & సేల్స్ ఆఫర్స్ వివరాలు

వివో V20 ప్రో 5G ధరలు & సేల్స్ ఆఫర్స్ వివరాలు

వివో యొక్క కొత్త 5G ఫోన్ వివో V20 ప్రో 5G ఇండియాలో ఏకైక స్టోరేజ్ వేరియంట్ లో విడుదల అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.29,990 ధర వద్ద మిడ్నైట్ జాజ్ మరియు సన్సెట్ మెలోడీ వంటి కలర్ ఆప్షన్లలో విడుదల అయింది. దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, పేటీఎం మాల్, టాటా క్లిక్, మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ EMI స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ఆఫర్‌లలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు లావాదేవీలపై 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ.2,500 తగ్గింపు, V-షీల్డ్ ఫుల్ మొబైల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ మరియు 12 నెలల నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా రూ.10,000 విలువైన జియో యొక్క ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

 

Also Read: Xiaomi Mi TV 4A స్మార్ట్‌టీవీల ధరలు పెరిగాయి!!! ఎంత పెరిగాయో తెలుసా??Also Read: Xiaomi Mi TV 4A స్మార్ట్‌టీవీల ధరలు పెరిగాయి!!! ఎంత పెరిగాయో తెలుసా??

వివో V20 ప్రో 5G స్నాప్‌డ్రాగన్ 765G SoC స్పెసిఫికేషన్స్
 

వివో V20 ప్రో 5G స్నాప్‌డ్రాగన్ 765G SoC స్పెసిఫికేషన్స్

వివో V20 ప్రో 5G కొత్త ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌టచ్ OS11 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌ యొక్క 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లే 1,080x2,400 పిక్సెల్‌ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో పాటుగా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G SoCతో జత చేయబడి ఉంటుంది.

వివో V20 ప్రో 5G 44MP సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20 ప్రో 5G 44MP సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20 ప్రో 5G కొత్త ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.89 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ శామ్సంగ్ ISOCELL GW1 మొదటి సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ కెమెరా మరియు f / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. అలాగే ముందుభాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.0 ఆటోఫోకస్ లెన్స్‌తో 44 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.28 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌, 105 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి.

వివో V20 ప్రో 5G 33W ఫ్లాష్‌ఛార్జ్ బ్యాటరీ ఫీచర్స్

వివో V20 ప్రో 5G 33W ఫ్లాష్‌ఛార్జ్ బ్యాటరీ ఫీచర్స్

వివో V20 ప్రో 5G యొక్క బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, బ్లూటూత్ V5.1, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జిపిఎస్ / ఎ-జిపిఎస్ / నావిక్ మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంది. ఇతర సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, ఇ-కంపాస్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo V20 Pro 5G Smartphone Released in India: Price, Specifications, Features, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X