Home
News

Vivo V20 SE కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!! రూ.10000 జియో ఆఫర్లతో రేపటి నుంచి అమ్మకాలు

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఈ నెలలో మొదటిసారిగా వివో సంస్థ యొక్క ఫోన్ విడుదల అయింది. వివో V20 సిరీస్‌లో భాగంగా వివో V20SE స్మార్ట్‌ఫోన్‌ నేడు భారత్‌లో లాంచ్ చేశారు. ప్రస్తుతం వివో V20 ఫోన్ మాత్రమే విడుదల అయింది. వివో V20 ప్రో ఈ నెలాఖరులో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివో V20SE ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతూ సింగిల్ సెల్ఫీ షూటర్‌ కెమెరాను నాచ్ డిస్ప్లేలో కలిగి ఉంటుంది. ఒకే ఒక ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందించబడే కొత్త ఫోన్ XX కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో V20SE స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో V20SE స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో V20SE స్మార్ట్‌ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్లో విడుదల చేసారు. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 20,990 రూపాయలు. ఇది ఆక్వామారిన్ గ్రీన్ మరియు గ్రావిటీ బ్లాక్ అనే రెండు కలర్ ఎంపికలలో అందించబడుతుంది. ఈ ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు ఇండియాలో నవంబర్ 3 మంగళవారం నుండి వివో ఇండియా ఇ-స్టోర్ మరియు ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా మొదలుకానున్నాయి.

వివో V20SE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పైన ఫంటౌచ్ OS11 ద్వారా రన్ అవుతుంది. ఇది 6.44-అంగుళాల ఫుల్- HD+ అమోలేడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 8GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది.

వివో V20SE 32MP సెన్సార్‌ సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20SE 32MP సెన్సార్‌ సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, f/ 2.2 వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు 2 బోకే ప్రభావం కోసం ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలతో ప్యాక్ చేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో V20SE 33W ఫ్లాష్ ఛార్జ్ కనెక్టివిటీ ఫీచర్స్

వివో V20SE 33W ఫ్లాష్ ఛార్జ్ కనెక్టివిటీ ఫీచర్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ కేవలం 128GB ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, FM రేడియో మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 4,100mAh పెద్ద బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జ్  ఛార్జింగ్ మద్దతుతో అందిస్తుంది. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది. చివరగా ఈ ఫోన్ 161x74.08x7.83mm కొలతల పరిమాణంలో 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo V20 SE New Smartphone Released in India: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X