Vivo V20 మొదటి సేల్ నేడే!!! అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు....

|

వివో V20 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా నేటి నుండి ఇండియాలో మొదలయ్యాయి. వివో సంస్థ తన V-సిరీస్ లో భాగంగా ఇటీవల గత వారంలో వివో V20ను విడుదల చేసింది. 44 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు మరియు 4,000mAh వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వివో V20 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో V20 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో V20 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రెండు వేరు వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌ను రూ.24,990గా ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.27,990 ధర వద్ద మిడ్నైట్ జాజ్, మూన్లైట్ సోనాట మరియు సన్సెట్ మెలోడీ అనే మూడు కలర్ ఎంపికలలో ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

 

Also Read: మీరు laptop కొనాలనుకుంటే ఇదే చక్కని అవకాశం! Flipkart లో మంచి ఆఫర్లు ఉన్నాయి ....Also Read: మీరు laptop కొనాలనుకుంటే ఇదే చక్కని అవకాశం! Flipkart లో మంచి ఆఫర్లు ఉన్నాయి ....

వివో V20 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు
 

వివో V20 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు

వివో V20 స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో కొనుగోలు చెయవచ్చు. ఆన్‌లైన్‌ పద్దతిలో ఫ్లిప్‌కార్ట్ కాకుండా వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీత, బిగ్ సి, మరియు లాట్ వంటి వివిధ ఆఫ్‌లైన్ రిటైల్ ద్వారా కూడా దీనిని నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే లాంచ్ ఆఫర్‌లలో భాగంగా వి-షీల్డ్ మొబైల్ ప్రొటెక్షన్, రూ.2,500 వరకు అడిషనల్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ మరియు 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు లభిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మరియు జెస్ట్ మనీ ద్వారా కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు VI(వోడాఫోన్ ఐడియా) ద్వారా 12 నెలల పొడిగించిన వారంటీతో సహా రూ.819 విలువ గల రీఛార్జ్ కూపన్లు లభిస్తాయి.

వివో V20 స్నాప్‌డ్రాగన్ 720G SoC స్పెసిఫికేషన్స్

వివో V20 స్నాప్‌డ్రాగన్ 720G SoC స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ గల వివో V20 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 లో ఫన్‌టచ్ ఓఎస్ 11 తో రన్ అవుతుంది. ఇది 20: 9 కారక నిష్పత్తితో మరియు 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణంలో 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC తో పాటుగా 8GB RAM తో ప్యాక్ చేయబడి వస్తుంది.

వివో V20 44MP 4K సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20 44MP 4K సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20 స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.89 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఆటోఫోకస్ లెన్స్ తో 44 మెగాపిక్సెల్ స్నాపర్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 4K సెల్ఫీ వీడియో, స్టెడిఫేస్ సెల్ఫీ వీడియో, సూపర్ నైట్ సెల్ఫీ 2.0, డ్యూయల్ వ్యూ వీడియో, స్లో-మో సెల్ఫీ వీడియో, మరియు మల్టీ-స్టైల్ పోర్ట్రెయిట్‌తో సహా ప్రీలోడ్ చేసిన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

వివో V20 33W ఫ్లాష్‌ఛార్జ్ & ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్

వివో V20 33W ఫ్లాష్‌ఛార్జ్ & ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్

వివో V20 స్మార్ట్‌ఫోన్ లో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే ఫోన్ కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. చివరిగా ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది. ఇది 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 7.38mm మందంతో 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo V20 Smartphone First Sale Starts on Flipkart and Vivo Website With Discount Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X