44MP సెల్ఫీ కెమెరా ఫీచర్స్ Vivo V20 స్మార్ట్‌ఫోన్ మీద రూ.2000 భారీ ధర తగ్గింపు...

|

ఇండియాలో గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన వివో V20 స్మార్ట్ ఫోన్ యొక్క ధర మీద సుమారు రూ.2,000 వరకు తగ్గింపును అందిస్తున్నది. ఈ తగ్గింపు ధరలు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌లో ప్రతిబింబిస్తున్నాయి. ఇటీవల వివో V20 (2021) కి అప్‌గ్రేడ్ అయింది. వివో V20 గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినప్పటికి సంస్థ తరువాత డిసెంబరులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730Gతో స్మార్ట్‌ఫోన్‌ను రిఫ్రెష్ చేసింది. అద్భుతమైన డిజైన్ మరియు 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వివో V20 తగ్గింపు ధరల వివరాలు

వివో V20 తగ్గింపు ధరల వివరాలు

ఇండియాలో వివో V20 ను గత ఏడాది రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.24,990 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.27,990 ధరల వద్ద లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం రూ.2000 ధర తగ్గింపును అందుకున్న తరువాత ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌లో 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.22,898 మరియు 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.25,490 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఇవి మిడ్నైట్ జాజ్ మరియు సన్సెట్ మెలోడీ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

వివో V20 స్నాప్‌డ్రాగన్ 720G SoC స్పెసిఫికేషన్స్

వివో V20 స్నాప్‌డ్రాగన్ 720G SoC స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ గల వివో V20 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 లో ఫన్‌టచ్ ఓఎస్ 11 తో రన్ అవుతుంది. ఇది 20: 9 కారక నిష్పత్తితో మరియు 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణంలో 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC తో పాటుగా 8GB RAM తో ప్యాక్ చేయబడి వస్తుంది.

వివో V20 64MP కెమెరా ఫీచర్స్
 

వివో V20 64MP కెమెరా ఫీచర్స్

వివో V20 స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.89 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఆటోఫోకస్ లెన్స్ తో 44 మెగాపిక్సెల్ స్నాపర్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 4K సెల్ఫీ వీడియో, స్టెడిఫేస్ సెల్ఫీ వీడియో, సూపర్ నైట్ సెల్ఫీ 2.0, డ్యూయల్ వ్యూ వీడియో, స్లో-మో సెల్ఫీ వీడియో, మరియు మల్టీ-స్టైల్ పోర్ట్రెయిట్‌తో సహా ప్రీలోడ్ చేసిన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

వివో V20 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్

వివో V20 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్

వివో V20 స్మార్ట్‌ఫోన్ లో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే ఫోన్ కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. చివరిగా ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది. ఇది 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 7.38mm మందంతో 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo V20 Smartphone Price Slashed in India Up to Rs.2,000: New Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X