Home
News

Vivo నుంచి మరొక కొత్త 5G ఫోన్ లాంచ్!! వివో V21 5G ధరలు, ఫీచర్స్ ఇవే...

ప్రముఖ వివో స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నేడు ఇండియాలో వివో V21 5G ను విడుదల చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 800 U SoC వంటి ఫీచర్లను కలిగి ఉండి గత ఏడాది అక్టోబర్‌లో దేశంలో విడుదలైన వివో V20 కి అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న కొత్త వివో ఫోన్ డ్యూయల్ LED సెల్ఫీ ఫ్లాష్ తో పాటుగా AI ఎక్స్‌ట్రీమ్ నైట్, స్పాట్‌లైట్ సెల్ఫీ మరియు ఐ ఆటోఫోకస్ సెల్ఫీ వంటి ప్రీలోడ్ ఫీచర్లతో వస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో V21 5G ధరల వివరాలు

వివో V21 5G ధరల వివరాలు

భారతదేశంలో వివో V21 5G రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.29,990 కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.32,990. ఈ ఫోన్ ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ మరియు సన్‌సెట్ డాజిల్ వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. నేటి నుండి దీనిని ప్రీ-బుకింగ్‌ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మే 6 నుండి ఈ ఫోన్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ మరియు వివో ఇండియా ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అలాగే రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీత మొబైల్, మరియు బిగ్ C వంటి ప్రధాన ఆఫ్‌లైన్ దుకాణాలలో కూడా పొందవచ్చు.

వివో V21 5G లాంచ్ ఆఫర్లు

వివో V21 5G లాంచ్ ఆఫర్లు

వివో V21 5G యొక్క లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.2,000 తక్షణ క్యాష్‌బ్యాక్ మరియు రూ.3,000 విలువైన అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మరియు 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు లభిస్తాయి. ఈ ఆఫర్‌లు ఆన్‌లైన్ కొనుగోలుపై వర్తిస్తాయి. ఆఫ్‌లైన్ కస్టమర్లకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ద్వారా 10 శాతం క్యాష్‌బ్యాక్, బజాజ్ ఫిన్‌సర్వ్ EMI కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్, మరియు హోమ్ క్రెడిట్ మరియు టివిఎస్ క్రెడిట్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ వంటి ఆఫర్లు కూడా లభిస్తాయి. వినియోగదారులకు వివో అప్‌గ్రేడ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీని కింద వారు రూ.1,500 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.800 లాయల్టీ బోనస్‌తో పాటు 80 శాతం వరకు భరోసా బైబ్యాక్ గ్యారెంటీ లభిస్తుంది.

వివో V21 5G మల్టీ టాస్కింగ్ స్పెసిఫికేషన్స్

వివో V21 5G మల్టీ టాస్కింగ్ స్పెసిఫికేషన్స్

వివో V21 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో ఫన్‌టచ్ ఓఎస్ 11.1 తో రన్ అవుతుంది. ఇది 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలేడ్ డిస్‌ప్లేను 1,080x2,404 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 U Soc తో పాటు 8GB వరకు ర్యామ్‌తో జతచేయబడి వస్తుంది. మెరుగైన మల్టీ టాస్కింగ్ అనుభవం కోసం హార్డ్‌వేర్ 3GB వరకు ROM ను వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించడానికి అనుమతించే విధంగా RAM ఫీచర్ కూడా ఉంది.

వివో V21 5G

వివో V21 5G ఫోన్ యొక్క ఇమేజింగ్ ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు కలిగి ఉన్నాయి. వెనుక కెమెరా LED ఫ్లాష్ మాడ్యూల్ మరియు OIS మద్దతుతో జత చేయబడి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల విషయానికొస్తే ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా డ్యూయల్ ఎల్ఈడి సెల్ఫీ ఫ్లాష్ తో జత చేయబడింది.

Best Mobiles in India

English summary
Vivo V21 5G Smartphone Released in India: Price, Specs, Sale Date, Launch Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X