Vivo V21e 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ లీక్ అయ్యాయి!! వివరాలు ఇవిగో...

|

ప్రముఖ వివో స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇండియాలో తన యొక్క పోర్టుపోలియోలో కొత్తగా వివో V21e 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నది. అయితే ఇండియాలో లాంచ్ చేయడానికి ముందే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ వంటి వివరాలతో కనిపించే ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అన్ని స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు తమ ఫోన్‌లను లాంచ్ చేయడానికి ముందుగా స్పెసిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వివో V21e 5G ఫోన్ యొక్క ఫీచర్లను భారతదేశంలో లాంచ్ చేయడానికి ముందే విడుదల అయ్యాయి.

వివో V21e 5G

వివో V21e 5G ఫోన్ యొక్క లీక్ పోస్టర్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటుగా రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఫీచర్లను చూడవచ్చు. ఈ పోస్టర్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో గల కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అలాగే ఈ వివో V21e 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చేత శక్తిని పొందుతుందని చెప్పబడింది. అయితే ఇప్పటికి ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతలు లేదా విడుదల తేదీకి సంబందించిన వివరాలను కంపెనీ విడుదల చేయలేదు.

 

Apple మాక్‌బుక్ ప్రో మోడల్‌ కొనుగోలు మీద 44 శాతం తగ్గింపు...Apple మాక్‌బుక్ ప్రో మోడల్‌ కొనుగోలు మీద 44 శాతం తగ్గింపు...

వివో V21e 5G లీక్ పోస్టర్

వివో V21e 5G లీక్ పోస్టర్

వివో V21e 5G యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్లతో ఫోన్ యొక్క అధికారిక పోస్టర్ ను టిప్స్టర్ యోగేష్ విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో వివోకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ చేతిలో లేత నీలిరంగు మోడల్‌లో గల ఫోన్ ను కలిగి ఉన్నాడు. అయితే ముదురు నీలం రంగు వేరియంట్ ను కూడా చూడవచ్చు. పోస్టర్‌లో 44W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు సూపర్ నైట్ సెల్ఫీ ఫీచర్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాకు మద్దతు ఉంది.

Vivo V21e 5G లీక్ స్పెసిఫికేషన్స్

Vivo V21e 5G లీక్ స్పెసిఫికేషన్స్

టిప్‌స్టెర్ వివో V21e 5G ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్‌లను కూడా విడుదల చేసింది. ఇది 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చేత శక్తినివ్వాలని సూచించింది. ఈ ఫోన్ కాన్ఫిగరేషన్లలో 8GB ర్యామ్ + 3GB వర్చువల్ ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 4,000mAh బ్యాటరీతో రావడమే కాకుండా సొగసైన డిజైన్ నిర్మాణంను కలిగి ఉండవచ్చు. అలాగే ఇది సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ తరహా నాచ్ డిజైన్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో V21e 5G ని వచ్చే రెండు వారాల్లో రూ.20,000 ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టిప్‌స్టెర్

ఈ వారం ప్రారంభంలో టిప్‌స్టెర్ లీక్ వివో V21e 5G కి సంబంధించి కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. ఈ లీక్ లలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC , నాచ్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు కాన్ఫిగరేషన్‌లను తాజా లీక్‌గా పేర్కొంది. అయితే మునుపటి లీక్ ఫోన్ 4,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో బ్యాకప్ చేయబడుతుందని పేర్కొంది. యోగేష్ పేర్కొన్న 4,000mAh సామర్థ్యం కంటే కొంచెం పెద్దది.

వివో V21e 4G వేరియంట్

వివో V21e 4G వేరియంట్

వివో V21e 4G వేరియంట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మలేషియాలో లాంచ్ అయింది. ఇది 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలేడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ నిర్మాణంలో కలిగి ఉంటుంది. ఇది 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 44 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4WmAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ సమయంలో ఈ ఫీచర్లలో 5G వేరియంట్ ఏది నిలుపుకుంటుందో అస్పష్టంగా ఉంది. వివో సంస్థ వివో V21e 5G కి సంబంధించి వివరాలను ఇంకా విడుదల చేయలేదు.

Best Mobiles in India

English summary
Vivo V21e 5G Smartphone Leaked Poster Released: Expected Specs, Features, Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X