Vivo V25 Pro 5G కలర్ మారే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

వివో బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నేడు ఇండియాలో వివో V25 ప్రో స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 5G నెట్‌వర్క్‌ల మద్దతుతో లభిస్తూ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC మరియు ఫన్ టచ్ OS 12పై రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రెండు రంగు ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ మరియు 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,830mAh బ్యాటరీ వంటి గొప్ప ఫీచర్ల కలయికతో లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో V25 ప్రో ధరల వివరాలు

వివో V25 ప్రో ధరల వివరాలు

వివో V25 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ మోడల్ యొక్క ధర రూ.35,999 కాగా 12GB RAM + 256GB ఇంబిల్ట్ స్టోరేజ్‌తో కూడిన టాప్-ఎండ్ వేరియంట్ యొక్క ధర రూ. 39,999. ఈ స్మార్ట్‌ఫోన్ ప్యూర్ బ్లాక్ మరియు సెయిలింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

వివో V25 ప్రో లాంచ్ సేల్స్ ఆఫర్స్

వివో V25 ప్రో లాంచ్ సేల్స్ ఆఫర్స్

వివో V25 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 25 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్ మరియు ఇతర రీటైల్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీనిని ప్రీ-బుకింగ్ చేసుకునే కస్టమర్‌లు రూ.3,000 వరకు తగ్గింపును పొందగలరు. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ మరియు EMI లావాదేవీలతో వారు రూ.3,500 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. .

వివో V25 ప్రో స్పెసిఫికేషన్స్

వివో V25 ప్రో స్పెసిఫికేషన్స్

వివో V25 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 5G నెట్‌వర్క్‌ మద్దతుతో డ్యూయల్ సిమ్ (నానో) నానో స్లాట్ ని కలిగి ఉంటుంది. ఇది ఫుల్-HD+ (2,376x1,080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Funtouch OS 12పై రన్ అవుతూ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoCతో శక్తిని పొందుతూ 12GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

వివో V25 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64-మెగాపిక్సెల్ సెన్సార్ మెయిన్ కెమెరా f/1.89 ఎపర్చరు మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో లభిస్తుంది. అలాగే f/2.2 ఎపర్చరుతో 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్ మరియు f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఐ ఆటోఫోకస్ మరియు f/2.45 ఎపర్చర్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

వివో V25 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయంలో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi (2.4GHz మరియు 5GHz), బ్లూటూత్ v5.2, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌ల జాబితాలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, సామీప్య సెన్సార్, ఇ-కంపాస్ మరియు గైరోస్కోప్ వంటివి కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ను అన్‌లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,830mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 158.9 x 73.52 x 8.62 మిమీ కొలతల పరిమాణంతో 190 గ్రా బరువుతో లభిస్తుంది. బాక్స్‌లో వివో ఛార్జింగ్ అడాప్టర్, USB టైప్-C కేబుల్, USB టైప్-C నుండి 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్ మరియు ఫోన్ కేస్‌ను చేర్చింది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీని వెనుక గ్లాస్ ప్యానెల్‌ కలర్ మారుతున్నట్లు ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo V25 Pro 5G Smartphone Launched in India With Colour Changing Back Panel: Price, Specs, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X