Home
News

Vivo Price cut వివో స్మార్ట్‌ఫోన్ల ధర తగ్గింపు.. స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు ..!

వివో సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. తాజాగా వివో సంస్థ తన Y200 స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది. దీంతోపాటు వినియోగదారుల కోసం vivo Y27 మరియు Vivo T2 స్మార్ట్‌ఫోన్‌ ధరలను (Vivo Smartphones Price cut) తగ్గించింది.

వివో Y27 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : Vivo V27 హ్యండ్‌సెట్‌ 1600*720 రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OSను కలిగి ఉంది. దీంతోపాటు మీడియాటెక్‌ హీలియో G85 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Vivo V27 and Vivo T2 Smartphones price cut

వివో Y27 స్మార్ట్‌ఫోన్‌ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యా్న్ని కలిగి ఉంది. మరియు కెమెరా విభాగం విషయానికి వస్తే వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

వివో T2 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : Vivo T2 స్మార్ట్‌ఫోన్‌ 6.38 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Vivo V27 and Vivo T2 Smartphones price cut

కెమెరా విషయానికి వస్తే.. ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 64MP ప్రధాన కెమెరా, 16MP సెల్పీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 5G SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు గరిష్ఠంగా 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.

వివో V27, వివో T2 5G స్మార్ట్‌ఫోన్ల ధరలను రూ.1000 చొప్పున తగ్గించింది. ఫలితంగా వివో Y27 హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.11,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా వివో T2 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.15,999గా ఉంది. అదే 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది.

బ్యాంకు కార్డులపై రూ.1000 క్యాష్‌ బ్యాక్‌ : ఈ వివో Y27, వివో T2 5G స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం తగ్గింపు ధరలకే ఫ్లిప్‌కార్డు, వివో ఆన్‌లైన్‌ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 క్యాష్‌బ్యాగ్‌ను పొందవచ్చని వివో వెల్లడించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo V27 and Vivo T2 Smartphone price drop in flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X