Vivo నుంచి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి! లాంచ్ వివరాలు తెలుసుకోండి.
Vivo యొక్క కొత్త ఫ్లాగ్‌షిప్ X90 సిరీస్‌తో సహా అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో, ఈ బ్రాండ్ తన V సిరీస్ స్మార్ట్ ఫోన్లని విస్తరించేందుకు కూడా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ V సిరీస్ లో భాగంగా Vivo V27 స్మార్ట్ ఫోన్ ని 2023 తొలి త్రైమాసికంలో లాంచ్ చేయవచ్చని కొత్త నివేదిక పేర్కొంది. ఇది Vivo V25 లైనప్‌కు వారసుడిగా వస్తోంది. ఈ కొత్త లైనప్ ఏ కొత్త ఫీచర్లను అందిస్తుంది మరియు ఇది పోటీలో పాల్గొనగలదా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Vivo V27 సిరీస్ లైనప్
Vivo V27 సిరీస్ లైనప్ యొక్క వార్తలు ఇప్పటికే మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. నివేదిక ప్రకారం రాబోయే Vivo సిరీస్‌లో మొదట్లో కనీసం రెండు మోడల్స్ ఉంటాయి. అవి Vivo V27 5G మరియు V27 Pro 5G కావచ్చు. Vivo V25e 4Gకి సక్సెసర్‌గా బ్రాండ్ గా Vivo V27e 4G స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయవచ్చు.

Vivo V27 సిరీస్ 2023లో లాంచ్
త్వరలో, రాబోయే Vivo V27 సిరీస్ 2023 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో లాంచ్ కావచ్చు. నివేదిక పరికరాల కోసం ఖచ్చితమైన ప్రారంభ తేదీని పేర్కొనలేదు లేదా అందించలేదు, అయితే ఇది Q1 2023లో జరగవచ్చు. Vivo V27 సిరీస్ తదుపరి తరం మరియు అధునాతన MediaTek డైమెన్సిటీ ప్రాసెసర్‌ల నుండి శక్తిని పొందుతుందని నివేదిక సూచిస్తుంది.

ఒక్కసారి గుర్తుకుచేసుకుంటే
ఒక్కసారి గుర్తుకుచేసుకుంటే, Vivo V25 లైనప్ హుడ్ కింద డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌తో లాంచ్ చేయబడింది.ఈ ఫోన్ OnePlus Nord స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర మిడ్-రేంజర్‌లకు పోటీదారుగా వస్తోంది. రాబోయే Vivo V27 లైనప్ నుండి కూడా అదే ఆశించవచ్చు. ఇది తప్ప, ఈ సిరీస్ గురించిన ఇతర వివరాలు ఏమీ తెలియవు.

Vivo V25 4G త్వరలో భారతదేశంలో లాంచ్ కాబోతోంది.
అంతేకాకుండా, Vivo V25 బ్యానర్‌లో మరొక స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేయగలదు. ఇది ఈ సిరీస్‌లో చివరి స్మార్ట్ ఫోన్ కావచ్చు. Vivo V25 4G రాబోయే వారాల్లో భారతదేశంలో లాంచ్ కావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరికరం , Vivo V25e 4G కి రీబ్రాండెడ్ వెర్షన్ గా రాబోతోందని అన్ని లీక్‌లు సూచిస్తున్నాయి. ఇది ఇటీవల థాయ్‌లాండ్‌లో అధికారికంగా లాంచ్ చేయబడింది.

Realme 10 4G కి పోటీ
4G స్మార్ట్‌ఫోన్‌గా, Vivo V25 ఫోన్ 8GB వరకు RAM మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తూ Helio G99 చిప్‌సెట్ నుండి శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. దాని డిజైన్ ను బట్టి, కొత్త Vivo V25 4G రాబోయే Realme 10 4Gతో నేరుగా పోటీపడగలదు.Realme 10 4G 180Hz టచ్ రెస్పాన్స్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-HD+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ ఎంత ఉంటుందో ప్రస్తుతం తెలియదు. Realme 10 4G మీడియా టెక్ యొక్క Helio G99 చిప్‌సెట్ ద్వారా LPDDR4x RAM మరియు UFS 2.2 స్టోరేజ్‌తో జతచేయబడుతుంది.

అధికారికంగా
ప్రస్తుతం, Realme 10 4G నవంబర్ 17 న చైనాలో లాంచ్ చేయబడింది మరియు తరువాతి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడుతుంది. Vivo V25 4G కూడా అదే సమయంలో ప్రారంభించవచ్చు. కానీ అధికారికంగా ఇప్పటివరకు ఏదీ ధృవీకరించబడనందున అధికారిక సమాచారం కోసం వేచి ఉండటం ఉత్తమం.


Click it and Unblock the Notifications








