Home
News

50MP సెల్ఫీ కెమెరా, 8GB ర్యామ్‌ Vivo స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. బ్యాంకు కార్డుపై రూ.2000 అదనపు డిస్కౌంట్‌..!

వివో సంస్థ గత సంవత్సరం వివో V29e స్మార్ట్‌ఫోన్‌ను (Vivo V29e Smartphone) లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. తాజాగా ఈ ఫోన్‌ ధరను సంస్థ తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్‌ 64MP ప్రైమరీ కెమెరా సహా 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు పుల్‌ HD+ డిస్‌ప్లేతో వస్తుంది.

వివో V29e స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 128GB స్టోరేజీ ధర రూ.26,999, 256GB స్టోరేజీ ధర రూ.28,999 గా ఉంది. తాజాగా ఈ రెండు వేరియంట్ల ధరలను (Vivo Smartphone Price cut) రూ.1000 చొప్పున సంస్థ తగ్గించింది.

Vivo V29e Smartphone

SBI కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే మరో రూ.2000 తగ్గింపు : దీంతోపాటు ఈ వివో V29e స్మార్ట్‌ఫోన్‌ను SBI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆర్టిస్టిక్‌ రెడ్‌, ఆర్టిస్టిక్‌ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

వివో V29e స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 1080*2400 రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు డైమండ్‌ కట్‌ క్రిస్టల్‌ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది.

Vivo V29e Smartphone

5000mAh బ్యాటరీ : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ 8GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Funtouch OS 13 పైన పనిచేస్తుంది. మరియు 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

రెండు వేరియంట్లు : ఈ వివో V29e స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. మరియు ఈ హ్యండ్‌సెట్‌ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

50MP సెల్ఫీ కెమెరా : ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.79 అపేచర్‌తో 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.5 అపేచర్‌తో 50MP కెమెరాను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V29e Smartphone Received price cut in india here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X