Home
News

50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో వివో V40e స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. సెప్టెంబర్‌ 25 మధ్యాహ్నం 12 గంటలకు (Vivo V40e Smartphone Launch Date) విడుదల కానుందని సంస్థ వెల్లడించింది. విడుదల అనంతరం వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది. ఈ వివో V40e డిజైన్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న V40, V40 ప్రో మోడళ్ల తరహా డిజైన్‌ను కలిగి ఉంటాయి.

వివో V40e స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఇప్పటి వరకు విడుదలైన వివరాల ఆధారంగా వివో V40e స్మార్ట్‌ఫోన్‌ (Vivo V40e Smartphone) 6.77 అంగుళాల పుల్‌ HD+ 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2392*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 93.3% స్క్రీన్‌ టూ బాడీ రేషియో, HDR10+ సపోర్టును కలిగి ఉన్నాయి.

Vivo V40e Smartphone launch date confirmed in india

వివో V40e స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బరువు కేవలం 183 గ్రాములు ఉంటుందని తెలుస్తోంది.

వివో V40e స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 90 గంటలపాటు మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ మరియు 20 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని తెలుస్తోంది. వివో V40e స్మార్ట్‌ఫోన్‌ మింట్‌ గ్రీన్‌, రోయల్‌ బ్రాంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

కెమెరా విభాగం పరంగా వివో స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ ను కలిగి ఉంటుందని సమాచారం. అదే ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP ఆటోఫోకస్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలతో 4K నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేయవచ్చు.

వివో v40e స్మార్ట్‌ఫోన్‌ ధర సహా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. అయితే కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ రూ.30,000 ధర సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్పష్టత కోసం విడుదల తేదీ వరకు ఎదురుచూడాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది.

భారత్‌ మార్కెట్‌లో వివో నుంచి ఇటీవలే వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. సెప్టెంబర్‌ 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.31999 గా ఉంది. మొత్తం మూడు స్టోరేజీ వేరియంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ అల్ట్రా మోడల్‌ లూనార్‌ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP సోనీ IMX921 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు Aura రింగ్‌ లైట్‌ ను కూడా కలిగి ఉంది. AI Photo Enhance, AI Eraser వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఫోన్‌ నుంచే ఫోటోలను ఎడిట్‌ చేసేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V40e Smartphone launch date confirmed in india expected specs features and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X