Home
News

50MP సెల్ఫీ కెమెరాతో Vivo V40e ఇండియాలో లాంచ్ అయింది! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు 

Vivo సంస్థ ఈ రోజు బుధవారం భారతదేశంలో ప్రారంభించబడింది.ఈ హ్యాండ్‌సెట్‌ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ తో వస్తుంది. మరియు 80W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడింది మరియు రెండు కలర్‌వేస్‌తో పాటు రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది ఆగస్టులో లాంచ్ అయిన Vivo V40 మరియు V40 ప్రో సిరీస్ ఫోన్‌లలో చేరింది.

Vivo V40e With 50MP Selfie Camera MediaTek Dimensity 7300 SoC 80W fast charging Launched In India

భారతదేశంలో Vivo V40e ధర, లభ్యత వివరాలు
భారతదేశంలో Vivo V40e ప్రారంభ ధర 8GB + 128GB ఎంపిక కోసం రూ.28,999 గా ఉంది. అయితే 8GB + 256GB వేరియంట్ రూ. 30,999 గా ఉంటుంది. ఈ ఫోన్ మింట్ గ్రీన్ మరియు రాయల్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.

అక్టోబర్ 2 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ మరియు మెయిన్‌లైన్ స్టోర్‌ల ద్వారా ఈ ఫోన్ దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ మరియు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ కొనుగోలుదారులు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ప్రయోజనాలను లేదా ఫ్లాట్ 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. HDFC మరియు SBI కార్డ్ హోల్డర్లు ఫ్లాట్ 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.

Vivo V40e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు
వివో V40e ఫోన్ 6.77-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,392 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు SGS తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఇది తడి చేతులతో స్క్రీన్ వినియోగాన్ని అనుమతించే వెట్ టచ్ ఫీచర్‌ను కూడా పొందుతుంది.

వివో V40e ఫోన్ 4nm మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో 8GB LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్ టచ్ OS 14తో ఫోన్ షిప్పింగ్ చేయబడింది.

కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, Vivo V40e ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 50-మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ సెన్సార్ మరియు ఆరా లైట్ యూనిట్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు కెమెరాలో సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంది. ముందు మరియు వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లో AI ఎరేజర్ మరియు AI ఫోటో ఎన్‌హాన్సర్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా,ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Vivo V40e దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 5G, 4G LTE, Wi-Fi, GPS, OTG, బ్లూటూత్ 5.4 మరియు USB టైప్-C పోర్ట్ లు ఉన్నాయి. భద్రత కోసం, ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది 163.7x75.0x7.49mm పరిమాణం మరియు 183g బరువు ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo V40e With 50MP Selfie Camera,MediaTek Dimensity 7300 SoC,80W fast charging Launched In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X