Vivo V5s పై రూ.2000 శాశ్వత ధర తగ్గింపు
వివో బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన Vivo V5s స్మార్ట్‌ఫోన్ రూ.2000 శాస్వుత ధర తగ్గింపును అందుకుంది. కొత్త ధరలో భాగంగా రూ.15,990కే ఈ ఫోన్ లభ్యమవుతోంది.
వివో బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన Vivo V5s స్మార్ట్‌ఫోన్ రూ.2000 శాస్వుత ధర తగ్గింపును అందుకుంది. కొత్త ధరలో భాగంగా రూ.15,990కే ఈ ఫోన్ లభ్యమవుతోంది. 2017, ఏప్రిల్‌లో ఈ ఫోన్‌ను రూ.18,990 ధర ట్యాగ్‌తో వివో లాంచ్ చేసింది.

ఆ తరువాత రూ.1000 తగ్గించి రూ.17,990కి అందుబాటులో ఉంచారు. తాజాగా ఈ ఫోన్ ధరను మరో రెండు వేలుకు తగ్గిస్తూ వివో సంచలన నిర్ణయం తీసుకుంది.
వివో వీ5ఎస్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x1280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫన్‌టచ్ 3.0 ఓఎస్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. 1.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ప్లాష్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో ఫ్లాష్, సెల్ఫీస్, వీడియో కాలింగ్), 3000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో), కంపాస్ మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ఫోన్ బరువు 154 గ్రాములు. కొలత 153.80 x 75.50 x 7.55 మిల్లీ మీటర్లు.


Click it and Unblock the Notifications








