వివో V7 స్మార్ట్‌ఫోన్‌‌ పై భారీ డిస్కౌంట్ !

Posted By: Madhavi Lagishetty

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీ వివో...తన స్మార్ట్ ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇండియాలో వివో V7 స్మార్ట్ ఫోనుపై 2,000రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ 16,990 రూపాయలు ఉంటే...ఇప్పుడు 18,990రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉంది.

వివో V7 స్మార్ట్‌ఫోన్‌‌ పై భారీ డిస్కౌంట్ !

ఈ డిస్కౌంట్ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ దుకాణాల్లో అందుబాటులో ఉంది. కొత్త ధరకే వివో V7 స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్స్ వేరియంట్లో యూజర్లకు అందుబాటులో ఉంది. మాట్టే బ్లాక్, ఛాంపాగ్నే గోల్డ్, మరియు ఎనర్జిటిక్ బ్లూ కలర్స్ లో ఉన్నాయి. ఈమధ్యే రిలీజ్ అయిన ఎనర్జిటిక్ బ్లూ లాంచింగ్ సమయంలో ...ఫ్లిప్ కార్ట్ లో ఆన్ లైన్ ద్వారా ఎక్సూక్లూజివ్ గా అందించింది. కానీ ఇప్పుడు అమెజాన్ మరియు పేటిఎం మాల్ మాత్రమే యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

ఇక వివో V7 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ పరంగా చూసినట్లయితే...చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ గురించి లాంచింగ్ సమయంలో ఫీచర్ల గురించి వివరించాం. కానీ మరోసారి ఈ ఫోన్ స్పెసిఫిక్స్ చూసినట్లయితే...వివో V7 మెటల్ బాడీతో డిజైన్ చేశారు. ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ మొత్తం మెటల్ తో ఉంటుంది. 5.7అంగుళాల ఐపిఎస్ ఫుల్ వ్యూ స్క్రీన్ తో 1440,720పిక్సెల్స్ తోపాటు HD రిజల్యూషన్ను కలిగి ఉంటుంది.

18:9 యాస్పెక్స్ రేషియోతోపాటు హుడ్ కింద 64బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 450 ప్రొసెసర్ ద్వారా రన్ అవుతుంది. 4జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజి కెపాసిటిని అందిస్తుంది. మైక్రోఎస్డి కార్డు ద్వారా 256జిబి వరకు స్టోరేజి కెపాసిటిని మరింతగా విస్తరించుకోవచ్చు.

24మెగాపిక్సెల్స్ మూన్ లైట్ సెల్ఫీ కెమెరా వివో V7 స్మార్ట్ ఫోన్ కీ హైలెట్ అని చెప్పవచ్చు. అంతేకాదు F/2 యొక్క ఎపర్చరుతో వస్తుంది. సెల్ఫీ కెమెరా ఫేస్ బ్యూటీ 7.0 న్యాచురల్ ఎఫెక్ట్ మరియు పోర్ట్రేట్ మోడ్ తో సహా పలు మోడ్లను కలిగి ఉంది. ఫేస్ బ్యూటీ 7.0తో యూజర్లు వీడియో కాల్లో ఉన్నప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటుంది.

13 ఎంపీ కెమెరాతో Eluga Ray 500, రెడ్‌మి నోట్ 4కి సవాల్

అంతేకాదు ఫేస్ ఏక్సెస్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ఫీచర్ సహాయంతో ఫేస్ రికగ్నైజ్ తో అన్లాక్ చేయవచ్చు. బ్యాక్ కెమెరా కోసం 16మెగాపిక్సెల్ సెన్సార్ను F/2 యొక్క అదే ఎపర్చరు సైజులో ఉపయోగిస్తుంది. బ్యాక్ కెమెరా PDAF మరియు పోర్ట్రైట్ మోడ్తో కూడా అమర్చబడి ఉంటుంది.

ఇక ఈ డివైస్ 3,000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సాఫ్ట్ వేర్ ఫ్రంట్లో వివో V7 కంపెనీ యొక్క Funtouch OS 3.2తో ముందే ఇన్ స్టాల్ చేసి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 7.1నౌగట్ ఆధారంగా రూపొందించబడింది.

వై-ఫై, బ్లూటూత్ 4.2, ఎఫ్ఎమ్ రేడియో, గ్లోనస్, జిపిఎస్, బీడౌ, ఓటిజి, మైక్రో యూఎస్బి పోర్ట్ వంటి ఫీచర్లు కనెక్టివిటీ ఫ్రంట్లో ఉన్నాయి. ఈ ఫోన్ 139గ్రాముల బరువుతో ఉంటుంది.

వీటితోపాటు స్మార్ట్ స్ప్లిట్ 3.0మరియు క్లోన్ అప్లికేషన్ వంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లతో ఈస్మార్ట్ ఫోన్ వస్తుంది.

English summary
One of the key highlights of the Vivo V7 is its 24MP moonlight selfie camera that comes with an aperture of f/2.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot