వివో నుంచి కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు.. స్లిమ్ డిజైన్ సహా కీలక స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు..!
వివో సంస్థ త్వరలో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు Vivo X Fold 3 మరియు X Fold 3 Pro ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్లు ఈ నెల చివర్లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. బేస్ మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ మరియు ప్రో మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అయితే weibo పోస్ట్ ఆధారంగా ఈ రెండు వివో ఫోల్డబుల్ (Vivo Foldable Smartphones 2024) స్మార్ట్‌ఫోన్లు మార్చి 26, 27 లేదా 28 తేదీల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని లీక్‌ల ఆధారంగా త్వరలో అందుబాటులోకి రానున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు వైట్, బ్లాక్ రంగుల్లో లభించనున్నాయని తెలుస్తోంది. మరియు సన్నగా మరియు తక్కువ బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

వివో X ఫోల్డ్ 3 ప్రో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ LTPO 2K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త తరం ఫోన్లు పాత మోడళ్ల కంటే మరింత సన్నగా ఉంటాయని తెలుస్తోంది.
దీంతోపాటు వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల ఇన్నర్, అవుటర్ డిస్‌ప్లేలు అల్ట్రాసోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అయితే బ్యాటరీ సామర్థ్యాలపై ఎటువంటి వివరాలు వెల్లడికాకున్నా.. ఈ ప్రో మోడల్ 100W వైరడ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఫొట్రోగ్రఫీ విషయానికి వస్తే ఈ ఫోల్డబుల్ వివో ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా మరియు పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, అల్ట్రావైడ్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సోనీ LYT-900 ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
వివో X ఫోల్డ్ 3: weibo పోస్ట్ ఆధారంగా వివో X ఫోల్డ్ 3.. ఫోన్ కెమెరా డిజైన్ ముందు మోడల్ కంటే కాస్త భిన్నమైన మార్చులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. ప్లాష్ లైట్ కుడివైపున కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. Zeiss బ్రాండ్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. గత జనరేషన్ ఫోన్ల కంటే మరింత సన్నగా ఉంటుందని సమాచారం. మరియు తక్కువ బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
మరికొన్ని నివేదికల ప్రకారం ఈ వివో X ఫోల్డ్ 3 ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కస్టమ్ ఇమేజ్ V3తో రానుందని సమాచారం. 4k 60fps నాణ్యతతో వీడియో రికార్డింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








