Home
News

16GB ర్యామ్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ Vivo ఫోన్ల సేల్ ప్రారంభం అయింది.. బ్యాంకు కార్డులపై 10 శాతం ధర తగ్గింపు!

వివో నుంచి జనవరి 4న.. Vivo X100 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో వివో X100, వివో X100 ప్రో హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. వివో ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి.

వివో X100 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.63,999, అదే 16GB ర్యామ్+ 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.69,999గా ఉంది. ఈ ఫోన్లు స్టార్‌గేజ్‌ బ్లూ, ఆస్టరాయిడ్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. అదే ప్రో మోడల్‌ ఫోన్‌ 16GB ర్యామ్‌ +512GB స్టోరేజీ ధర రూ.89,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఆస్టరాయిడ్‌ బ్లాక్‌ రంగుల్లో లభించనుంది.

vivo-x100-series-smartphones-india

వివో X100 సిరీస్‌ ప్రారంభ ఆఫర్‌ కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. HDFC బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదేవిధంగా SBI డిబిట్‌, క్రిడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసినా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.8000 వరకు తగ్గింపు ధర పొందవచ్చు.

వివో X100 : ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్‌ OS 14 పైన పనిచేస్తుంది. మరియు 6.78 అంగుళాల అమోలెడ్‌ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. 16GB LPDDRX ర్యామ్‌ మరియు వివో V2 చిప్‌ను కలిగి ఉంటుంది.

vivo-x100-series-smartphones-india

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ ఫోన్‌ OIS సపోర్టుతో 50MP సోనీ IMX920 VCS బయోనిక్‌ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 100X జూమ్‌తో 64MP Zeiss సూపర్‌ టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. 120Hz ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు : ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్‌ OS 14 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. వివో కొత్త V3 ఇమేజింగ్ చిప్‌ మరియు 16GB LPDDR5X ర్యామ్‌, G720 GPUతో జతచేయబడుతుంది.

vivo-x100-series-smartphones-india

వివో X100 ప్రో 6.78 అంగుళాల అమోలెడ్‌ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1260'*2800 పిక్సల్‌ డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌తో వస్తుంది. 2160Hz హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌ మరియు 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

OIS ఫీచర్‌తో 50MP సోనీ IMX989 అంగుళాల సెన్సార్‌, 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, OIS సపోర్టుతో 50MP Zeiss APO సూపర్‌ టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు టెలీఫోటో కెమెరా 4.3X ఆప్టికల్‌ జూమ్‌తో వస్తుంది. ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. 100W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్లు 5G, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, GPS, OTG, USB-C యాక్సెలిరోమీటర్, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, కలర్‌ టెంపరేచర్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, ఇ-కంపాస్‌, ఇన్‌ఫ్రారెడ్‌ రిమోట్‌ కంట్రోల్ వంటి సెన్సార్లను కలిగి ఉంది. మరియు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X100 series smartphones india sale started price and offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X