Home
News

Vivo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు... 6.78 అంగుళాల డిస్‌ప్లే, 5400mAh బ్యాటరీ సహా.. !

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. Vivo X100 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్లోకి రానుంది. ఇందుకు సంబంధించి భారత్ వెబ్‌సైట్‌తో టీజర్‌ను ఉంచింది. ఈ ఫోన్‌ నవంబర్‌ 1న చైనాలో విడుదల అయింది.

Vivo X100 సిరీస్‌ : Vivo X100 మరియు Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoC చిప్‌తో పనిచేసే చైనాలో నవంబర్ 1న ప్రకటన చేసింది. గత వారం కొన్ని మార్కెట్‌లో విడుదల చేసింది. మరియు ఈ సిరీస్ ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

Vivo X100 series smartphones

వివో X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు వివో ఇప్పటికే స్పష్టం చేసింది. వివో X100 మరియు X100 ప్రో.. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoCను కలిగి ఉంటుంది. మరియు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. అయితే జనవరిలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే కచ్చితమైన విడుదల తేదీ వివరాలు వెల్లడికాలేదు.

వివో X100 సిరీస్‌ ధర : వివో X100 మరియు వివో X100 ప్రో హాంగ్‌ కాంగ్‌లో ఆవిష్కరించింది. భారత కరెన్సీ ప్రకారం.. రూ.85,224 మరియు రూ.63,917గా ఉంది. భారత్‌ మార్కెట్‌లోనూ ధరలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. అదే చైనాలోనూ విడుదల అయింది. భారత కరెన్సీలో రూ.56,500 మరియు రూ.50,000గా ఉంది.

Vivo X100 series smartphones

వివో X100 సిరీస్‌ స్పెసిఫికేషన్లు : వివో X100 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆరిజన్OS 4 పైన పనిచేస్తుంది. మరియు కర్వడ్‌ 6.78 అంగుళాల 8 LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. ఈ రెండు మోడళ్లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoC పైన పనిచేస్తాయి. వివో యొక్క V3 చిప్‌తో జతచేయబడతాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. అందులో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. వివో X100... 120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే ప్రో మోడల్‌ 5400mAh బ్యాటరీ, 100W వైరడ్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది.

ఈ వివో X100 మరియు వివో X100 ప్రో రెండు స్మార్ట్‌ఫోన్ల ర్యామ్‌, అంతర్గత స్టోరేజీ వివరాలు వెల్లడి కాలేదు. జనవరిలో ఈ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ధరలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X100 series smartphones will be launched on january 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X