వివో ఎక్స్20 ఇప్పుడు స్పెషల్ క్రిస్మస్ ఎడిషన్‌లో..

Posted By: BOMMU SIVANJANEYULU

వివో నుంచి మరో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎక్స్20 స్పెషల్ క్రిస్మస్ ఎడిషన్‌ను వివో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎడిషన్ ఎరుపు రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వివో ఎక్స్20 ఇప్పుడు స్పెషల్ క్రిస్మస్ ఎడిషన్‌లో..

పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఎక్స్20 స్పెషల్ క్రిస్మస్ ఎడిషన్‌ ఇతర వర్షన్‌లతో పోలిస్తే మరింత ప్రకాశవంతంగానూ ఇదే సమయంలో ఆకర్షణీయంగానూ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ కేసింగ్ మీద యాంటెన్నా బ్యాండ్‌తో పాటు వివో లోగో ఇంకా రేర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లు ఉంటాయి.

ఈ స్పెషల్ ఎడిషన్ డివైస్ పై గిఫ్ట్ బాక్సులను కూడా వివో అందిస్తోంది. ఈ బాక్సులో కస్టమైజిడ్ స్క్లాఫ్‌తో పాటు ఫోన్ కేస్‌లు ఉంటాయి.

వివో ఎక్స్20 ఇప్పుడు స్పెషల్ క్రిస్మస్ ఎడిషన్‌లో..

వివో ఎక్స్20 స్పెషల్ రెడ్ క్రిస్మస్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్.. 6.01 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గూగుల్ 2017 రౌండప్ : టాప్ సెర్చింగ్ మొబైల్స్ ఇవే !

చైనా మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు $483 (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.31059). డిసెంబర్ 16 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. వివో అఫీషియల్ మాల్‌తో పాటు వివో లినిక్స్ అఫీషియల్ షాప్, వివో
జింగ్‌డాంగ్ అఫీషియల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ఇంకా వివో సునింగ్ అఫీషియల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

English summary
Vivo has yet again unveiled another special edition of Vivo X20.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot