ఫీఫా వరల్డ్ కప్ ఎడిషన్‌తో Vivo

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపనీ వివో.. ఫీఫా వరల్డ్ కప్ 2018, ఫీఫా వరల్డ్ కప్ 2022లకు అఫీషియల్ స్పాన్సర్‌గా వ్యవహిరిస్తోన్న విషయం తెలిసిందే. రష్యా ఇంకా ఖతార్ వేదికగా జరగనున్న ఈ రెండు ఈవెంట్‌లు జరగనున్నాయి. రష్యాలో జరిగే ఈవెంట్ వచ్చే ఏడాది జూన్ 14న ప్రారంభమయ్యే జూలై 15తో ముగుస్తుంది.

 
ఫీఫా వరల్డ్ కప్ ఎడిషన్‌తో Vivo

ఈ ఒప్పందం నేపథ్యంలో ఫీఫా వరల్డ్ కప్ ఎక్స్20 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎడిషన్‌ను వివో లాంచ్ చేసింది. రష్యాలో జరిగే ఫుట్ బాల్ ఈవెంట్‌కు సంబంధించి శుక్రవారం తీసిన వరల్డ్ కప్ డ్రాలో భాగంగా ఈ డివైస్‌ను వివో ఆవిష్కరించింది. వివో ఎక్స్20 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
ఫీఫా వరల్డ్ కప్ ఎడిషన్‌తో Vivo

6.01 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (18:9 యాస్పెక్ట్ రేషియో), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 మొబైల్ చిప్‌సెట్ (క్లాక్ స్పీడ్ 2.2GHz), అడ్రినో 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ (24 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్), 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3245mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, బ్లుటాత్ 5.0, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డ్యుయల్ సిమ్ స్లాట్), ఫోన్ చుట్టుకొలత 155.85×75.15x 7.2 మిల్లీ మీటర్లు, బరువు 159 గ్రాములు.

4జిబి ర్యామ్‌తో హానర్ 7ఎక్స్, ధర రూ. 12,9994జిబి ర్యామ్‌తో హానర్ 7ఎక్స్, ధర రూ. 12,999

Best Mobiles in India

Read more about:
English summary
Following its partnership with FIFA, Vivo has now introduced a new FIFA World Cup X20 edition.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X