Vivo X50 ప్రో+ కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానున్నది !! ధరలు, ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి
ఇండియాలో ప్రతి సంవత్సరం వివో సంస్థ తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ ఉంది. అయితే త్వరలోనే వివో X50 సిరీస్ లో భాగంగా వివో X50 ప్రో+ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. వివో X50 ప్రో+ ను ఇప్పటికే చైనాలో ప్రారంభించారు. కొంతకాలంగా ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతున్నట్లు ఇప్పటికే చాలా పుకార్లు వినిపించాయి. చైనాలో ఇటీవల లాంచ్ అయిన వివో X60 సిరీస్‌తో పాటు వివో X50 ప్రో+ స్మార్ట్‌ఫోన్ కూడా త్వరలోనే భారత్‌లో లాంచ్ అవుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. వివో X50 ప్రో + మరియు X60 సిరీస్ యొక్క ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఇండియా లాంచ్
వివో యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా వివో X60 సిరీస్‌తో పాటు వివో X50 ప్రో + ను భారతదేశంలో మార్చి లేదా ఏప్రిల్‌లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆన్ లైన్ లో కొత్త లీక్ లు వెల్లడించింది. కొంతకాలంగా భారతదేశంలో వివో సంస్థ విడుదల చేస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ల గురించి అనేక పుకార్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోలు కూడా ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. లీక్ అయిన చిత్రంలో ఫోన్ క్యామెల్(ఒంటె) కలర్ లో ఉంది. దీనితో పాటుగా ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ యొక్క కొన్ని ప్రత్యేకతలు లీక్ అయ్యాయి. వీటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో X50 ప్రో +స్పెసిఫికేషన్స్
వివో X50 ప్రో + ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ చైనాలో ఇప్పటికే 6.56-అంగుళాల అమోలెడ్ ఫుల్ హెచ్‌డి + పంచ్-హోల్ డిజైన్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది HDR10+, 120HZ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 865 SOC, 12GB వరకు ర్యామ్ మరియు 256GB స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో నిలువు వరుసలో క్వాడ్-కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది.

వివో X50 ప్రో + స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,350mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఫన్‌టచ్ OS10.5 తో రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 11 తో విడుదల అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే వివో X50 ప్రో + రూ.40,000 లోపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది చైనా ధర కంటే తక్కువగా ఉంటుంది. హై-ఎండ్ స్పెక్స్‌ను బట్టి చూస్తే భారతదేశంలో షియోమి Mi10 సిరీస్ వంటి వాటితో పోటీ పడటంలో ఆసక్తికరంగా ఉంటుంది.

వివో X60 సిరీస్ స్పెసిఫికేషన్స్
వివో X60 మరియు X60 ప్రో, మరియు X60 ప్రో + లతో కూడిన వివో X60 సిరీస్ కూడా భారతదేశంలో ఏప్రిల్ మరియు మై నెలలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే భారతదేశంలో X50 ప్రో + ఆలస్యంగా రావడాన్ని పరిశీలిస్తే వివో X60 ప్రో + ఇప్పుడే భారతదేశంలో ప్రారంభించకపోవచ్చు. వివో X60 సిరీస్ స్పెసిఫికేషన్స్ విషయంలో పంచ్-హోల్ డిస్ప్లే, ఎక్సినోస్ 1080 చిప్‌సెట్, 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్, క్వాడ్ రియర్ కెమెరాలు, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి మరిన్ని ఉన్నాయి. అయితే ఇండియా యొక్క వెర్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌తో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








