Home
News

Vivo X60 సిరీస్ కొత్త ఫోన్ల ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

ప్రముఖ వివో కంపెనీ ఇండియాలో తన తాజా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా వివో X60 ప్రో +, వివో X60 ప్రో, మరియు వివో X60 లను విడుదల చేసింది. వివో X60 మరియు వివో X60 ప్రో గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో మొదట ప్రారంభించబడగా వివో X60 ప్రో + ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. ఇండియాలో వివో సంస్థ ఒకేసారి ఈ మూడు ఫోన్‌లను విడుదల చేసింది. ట్రిపుల్ మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ మరియు అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలను కలిగి ఉన్న వివో X60 సిరీస్ ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో X60 సిరీస్ ధరల వివరాలు

వివో X60 సిరీస్ ధరల వివరాలు

వివో X60 ప్రో + బ్లూ వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఒకే ఒక మోడల్‌తో రూ.69,990 ధర వద్ద విడుదలైంది. అలాగే వివో X60 ప్రో కూడా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ సింగిల్ మోడల్‌లో రూ.49,990 ధర వద్ద మిడ్నైట్ బ్లాక్ మరియు షిమ్మర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. చివరిగా వివో X60 రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ యొక్క ధర రూ.37,990 కాగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.41,990. ఇది కూడా మిడ్నైట్ బ్లాక్ మరియు షిమ్మర్ బ్లూ కలర్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

వివో X60 సిరీస్ ప్రీ-బుకింగ్

వివో X60 సిరీస్ ప్రీ-బుకింగ్

వివో X60 సిరీస్ యొక్క ప్రీ-బుకింగ్ ఈ రోజు అంటే మార్చి 25 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఏప్రిల్ 2 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి. ప్రీ-బుకింగ్ ఆఫర్లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ యొక్క EMI లావాదేవీల మీద 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇవి V- షీల్డ్ ఫుల్ మొబైల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ మరియు వివో అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ వంటివి కూడా అదనంగా లభిస్తాయి.

వివో X60 ప్రో + స్పెసిఫికేషన్స్

వివో X60 ప్రో + స్పెసిఫికేషన్స్

వివో X60 ప్రో + ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఫన్‌టచ్ OS 11.1 తో రన్ అవుతుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలేడ్ డిస్‌ప్లేను 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 240HZ, 1,080x2,376 పిక్సెల్‌ల టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. ఇది 398 PPI పిక్సెల్ డెన్సిటీ, 92.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు షాట్ ఎక్స్‌సేషన్ అప్ స్క్రీన్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC చేత శక్తిని పొందుతూ 12GB LPDDR5 ర్యామ్‌తో పాటు 256GB UFS 3.1 స్టోరేజ్ తో జతచేయబడి ఉంది. అలాగే ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.57 లెన్స్ 50 మెగాపిక్సెల్ GN1 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), ఎఫ్ / 2.2 లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 సెన్సార్ గింబాల్ స్టెబిలైజేషన్ మరియు F / 2.08 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెన్సార్, మరియు f / 3.4 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.45 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా అమర్చబడి ఉన్నాయి.

వివో X60 ప్రో స్పెసిఫికేషన్స్

వివో X60 ప్రో స్పెసిఫికేషన్స్

వివో X60 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 పై ఆధారిత ఫంటౌచ్ OS11.1 తో రన్ అవుతుంది. ఇది ప్రో + వేరియంట్ మాదిరిగానే డిస్‌ప్లేను ప్యాక్ చేస్తుంది మరియు ముందు భాగంలో షాట్ ఎక్స్‌సేషన్ అప్ మరియు వెనుకవైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ద్వారా రక్షించబడుతుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC చేత శక్తిని కలిగి ఉండి 12GB LPDDR4X RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో ఎఫ్ / 1.48 లెన్స్, గింబాల్ స్టెబిలైజేషన్‌తో 48 మెగాపిక్సెల్ సోనీ IMX598 సెన్సార్ మరియు, ఎఫ్ / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.46 లెన్స్‌తో మరో 13 -మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.45 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X60 Pro+, Vivo X60 Pro, Vivo X60 Smartphones Released in India: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X