Vivo X60 స్మార్ట్‌ఫోన్ ధరపై భారీ తగ్గింపు!! అదనంగా రూ.5000 క్యాష్‌బ్యాక్ కూడా
వివో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇండియాలో మార్చి నెలలో వివో X60 సిరీస్ లో భాగంగా వివో X60, వివో X60 ప్రో, మరియు వివో X60 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అయితే ఇప్పుడు వివో బ్రాండ్ తన యొక్క వివో X60 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మీద ఇప్పుడు సుమారు రూ.3,000 తగ్గింపును అందించింది. వనిల్లా వివో X60 మాత్రమే ధర తగ్గింపును పొందింది. అయితే మిగిలిన రెండు వేరియంట్‌లు ఇప్పటికీ వాటి లాంచ్ ధరను మాత్రమే కలిగి ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో X60 ధర తగ్గింపు & క్యాష్‌బ్యాక్ వివరాలు
వివో X60 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. రూ.37,990 ధర వద్ద లాంచ్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ మీద ఇప్పుడు రూ.3,000 ధర తగ్గింపు అందుకున్న తరువాత ఇప్పుడు రూ.34,990 ధర వద్ద లభిస్తుంది. అలాగే రూ.41,990 ధర వద్ద లాంచ్ అయిన 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.2,000 ధర తగ్గింపు అందుకున్న తరువాత ఇప్పుడు రూ.39,990 కొనుగోలు చేయడానికి లభిస్తుంది. అదనంగా వివో రూ.5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను కూడా ప్రకటించింది. ఈ తగ్గిన ధరలు వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు మరియు అన్ని ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములలో ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి వర్తిస్తుంది.

వివో X60 స్పెసిఫికేషన్స్
వివో X60 ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,376 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా శక్తిని పొందుతూ 12GB LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 3.1 విస్తరించలేని స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది.

వివో X60 ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX598 సెన్సార్‌ను f / 1.6 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 13-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సూపర్-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) మరియు f / 2.48 ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ బోకె షూటర్ 20x డిజిటల్ జూమ్ మద్దతుతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, బ్లూటూత్ v5.1 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, కలర్ టెంపరేచర్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ మరియు లేజర్-ఫోకసింగ్ సెన్సార్ ఉన్నాయి. అలాగే ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీని 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది. కొలతల పరంగా ఈ ఫోన్ 159.63x75.01x7.36 మిమీ మరియు 176 గ్రాముల బరువు ఉంటుంది.


Click it and Unblock the Notifications








