Home
News

Vivo X90 Pro పై రూ.10000 ధర తగ్గింది! కొత్త ధర వివరాలు

By Maheswara

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన Vivo X90 Pro ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ పై వివో సంస్థ రూ.10,000 ధర తగ్గింపు ప్రకటించింది. శుక్రవారం (అక్టోబర్ 20) న ప్రకటించిన ఈ ఆఫర్ ధర ప్రారంభ ధర నుండి తగ్గింపు లభిస్తుంది.

Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు Vivo యొక్క V2 చిప్‌తో పాటు మీడియా టెక్ డైమెన్సిటీ 9200 SoCపై నడుస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ IMX 989 1-అంగుళాల సెన్సార్‌తో కూడిన Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది.

Vivo X90 Pro Price Cut By Rs.10000 In India. New Price And Sale Offers Details Here.

భారతదేశంలో Vivo X90 Pro యొక్క ధర వివరాలు
భారతదేశంలో Vivo X90 Pro ధర రూ.10,000 తగ్గింది. దీనితో ప్రస్తుతం భారతదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.74,999 ధర ట్యాగ్‌తో లిస్ట్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒకే ఒక 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభంలో రూ. 84,999 గా లాంచ్ అయింది. ఇది సింగిల్ లెజెండరీ బ్లాక్ షేడ్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ధర ట్యాగ్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉంది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్ల వివరాలు
Vivo X90 ప్రో డ్యూయల్ సిమ్ తో ఆండ్రాయిడ్ 13 ఆధారిత FunTouch OS 13పై పనిచేస్తుంది. మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల (1,260x 2,800 పిక్సెల్‌లు) అమోలెడ్ 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ 4nm మీడియా టెక్ డైమెన్సిటీ 9200 SoCతో పాటు Vivo యొక్క V2 చిప్ సెట్, 12GB వరకు LPDDR5 RAM మరియు Immortalis G715 GPUతో పనిచేస్తుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, Vivo X90 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిని Zeiss తయారు చేసింది. ఈ కెమెరా సెటప్‌లో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మద్దతుతో 50-మెగాపిక్సెల్ సోనీ IMX 989 1-అంగుళాల సెన్సార్, 50-మెగాపిక్సెల్ సోనీ IMX 758 సెన్సార్ మరియు 12-మెగాపిక్సెల్ సోనీ IMX 663 సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Vivo X90 ప్రో స్మార్ట్ ఫోన్ లో 256GB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. ఇది ప్రామాణీకరణ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. దీనికి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,870mAh బ్యాటరీ వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X90 Pro Price Cut By Rs.10000 In India. New Price And Sale Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X