Vivo X90 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి ! ధర మరియు స్పెసిఫికేషన్ల వివరాలు.

By Maheswara
|

Vivo కంపెనీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ Vivo X90 సిరీస్ ఎట్టకేలకు విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన Vivo X90 సిరీస్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో టెక్ రంగంలో సంచలనం సృష్టించింది. Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Plus స్మార్ట్‌ఫోన్‌లను Vivo X90 సిరీస్‌లో లాంచ్ చేశారు. ఇందులో, Vivo X90 మరియు Vivo X90 Pro ఫోన్‌లు ఒకే ప్రాసెసర్ స్పీడ్‌ను అందిస్తాయి.

 Vivo X90 సిరీస్

Vivo X90 సిరీస్

అవును, Vivo X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లోకి లంచ్ అయింది. ఊహించినట్లుగానే ఈ స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు ఎన్నో ఆశ్చర్యకరమైన ఫీచర్లను తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్, ఆకర్షణీయమైన ప్యానెల్, మెరిసే కెమెరా సెటప్. ఈ సిరీస్‌లోని మూడు మోడల్‌లు ఇమేజ్ ప్రాసెసింగ్‌ను నిర్వహించడానికి Vivo V2 చిప్‌ను ప్యాక్ చేస్తాయి. ఇంతకీ, Vivo X90 సిరీస్ ఫోన్‌ల ప్రత్యేకత ఏమిటి తెలుసుకోండి.

Vivo X90 స్మార్ట్‌ఫోన్

Vivo X90 స్మార్ట్‌ఫోన్

Vivo X90 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 93.53% గా ఉంది. ఇది ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC ప్రాసెసర్‌తో ఆధారితం మరియు ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 12GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉన్నాయి.

కెమెరా సెటప్
 

కెమెరా సెటప్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 12MP 50mm పోర్ట్రెయిట్ కెమెరా మరియు 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇందులో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.2 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను ఆఫర్ చేయవచ్చని తెలిపింది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5.3, NFC, GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్

Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్

Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే 12GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని పొందింది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా పొందుతుంది. ప్రధాన కెమెరాలో 50-మెగాపిక్సెల్ Zeiss 1-అంగుళాల ప్రధాన సెన్సార్ ఉంది. రెండవ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-లెన్స్ సెన్సార్‌ను పొందుతుంది. ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్

Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్

Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్ 4,870mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం ఎనిమిది నిమిషాల్లో సున్నా నుండి 50% వరకు బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని చెప్పబడింది. కనెక్టివిటీ లలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5.3, NFC, GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Vivo X90 Pro + స్మార్ట్‌ఫోన్

Vivo X90 Pro + స్మార్ట్‌ఫోన్

Vivo X90 Pro+ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది Snapdragon 8 Gen 2 SoC ద్వారా ఆధారితం మరియు ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది. అలాగే 12GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని ఇది కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరాలో 50-మెగాపిక్సెల్ జీస్ 1-అంగుళాల సెన్సార్, 50-మెగాపిక్సెల్ సోనీ IMX758 సెన్సార్, f/2.0తో కూడిన 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇందులో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

80W ఫాస్ట్ ఛార్జింగ్

80W ఫాస్ట్ ఛార్జింగ్

ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5.3, NFC, OTG మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇందులో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, లేజర్ ఫోకస్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇది దుమ్ము మరియు వాటర్ రెసిస్టెంట్ కోసం IP68-రేటెడ్ నిర్మాణాన్ని కలిగి ఉంది.

ధర మరియు సేల్ వివరాలు

ధర మరియు సేల్ వివరాలు

Vivo X90 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర CNY 3,699 (సుమారు రూ. 42,000) నుండి ప్రారంభమవుతుంది.
Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర CNY 4,999 (సుమారు రూ. 57,000).
Vivo X90 Pro+ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర CNY 6,499 (దాదాపు రూ. 74,000).

ఈ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం చైనాలో లాంచ్ చేయబడ్డాయి మరియు సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.త్వరలోనే ఇండియా మార్కెట్లోకి కూడా వస్తాయని ఆశిద్దాం.

Best Mobiles in India

Read more about:
English summary
Vivo X90 Series Smartphones Launched With 120Hz Display And 32MP Selfie Camera. Price And Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X