Home
News

వివో X90 సిరీస్ ఫోన్ల, ఇండియా లాంచ్ తేదీ లీక్ ! ధర,స్పెసిఫికేషన్లు

By Maheswara

వివో సంస్థ తమ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లను వివో X90 సిరీస్ ను ఏప్రిల్ చివరి నాటికి భారతదేశంలో లాంచ్ చేయబోతున్నట్లు ఇటీవల లీకుల ద్వారా సూచించబడింది. వివో X90 లైనప్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్‌లు. వివో X90 మరియు వివో X90 ప్రో లు ఇప్పటికే గత ఏడాది నవంబర్‌లో చైనాలో లాంచ్ చేయబడ్డాయి.

అయితే ఈ ఫోన్‌ల వివరణాత్మక స్పెసిఫికేషన్‌ల గురించి కంపెనీ ఇంకా ఏమీ వెలువరించనప్పటికీ, ఇండియా లో వీటి లాంచ్ తేదీని ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసింది. వివో X90 మరియు వివో X90 ప్రో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటి స్పెసిఫికేషన్ల వివరాలపై ఒక అవగాహన ఉంది. వివో X90 మరియు X90 Pro రెండూ 6.78-అంగుళాల పూర్తి-HD+ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి.

Vivo X90, Vivo X90 Pro Expected To Launch In India On April 26. Leaked Details And Specifications

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్‌తో కలిసి ప్రైస్‌బాబా విడుదల చేసిన నివేదిక ప్రకారం, వివో X90 మరియు వివో X90 ప్రో ఫోన్లు ఏప్రిల్ 26న భారతీయ మార్కెట్లోకి లాంచ్ కానున్నాయి. ఈ టిప్‌స్టర్ రాబోయే ఈ ఫోన్‌ల యొక్క అంచనా ధర వివరాలను కూడా పంచుకున్నారు. Vivo X90 మరియు వివో X90 ప్రో ధర రూ.60,000 నుండి రూ. 80,000 మధ్య ఉండవచ్చని అంచనా ఉంది.

వివో X90 మరియు వివో X90 ప్రో ఫోన్లు గత సంవత్సరం చైనాలో వివో X90 ప్రో ప్లస్ తో పాటుగా విడుదల చేయబడ్డాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6.78 అంగుళాల పూర్తి HD+ (1,260x 2,800 పిక్సెల్‌లు) అమోలెడ్ స్క్రీన్‌తో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. అవి ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ OS 13పై రన్ అవుతాయి మరియు హుడ్ కింద మీడియా టెక్ డైమెన్సిటీ 9200 SoC ద్వారా శక్తిని పొందుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం వివో యొక్క అనుకూల V2 చిప్ కూడా ఉంది.

ఇక ఈ ఫోన్ల యొక్క కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఈ రెండు ఫోన్‌లు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలతో వస్తాయి. వివో X90 ఫోన్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX866 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా మరియు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. అయితే, వివో X90 ప్రో యొక్క కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ 50mm IMX758 సెన్సార్ మరియు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కూడా ఉంది.

ఇంకా ఈ ఫోన్ల యొక్క అదనపు స్పెసిఫికేషన్ల వివరాలు గమనిస్తే, వివో X90 ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, Vivo X90 సిరీస్ యొక్క ప్రో మోడల్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కు కూడా మద్దతుతో 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X90, Vivo X90 Pro Expected To Launch In India On April 26. Leaked Details And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X