వివో Y21 కొనుగోలుపై రూ.7000 జియో ఆఫర్లు!! ఈ నెల 30 వరకు మాత్రమే
వివో Y21 స్మార్ట్‌ఫోన్ నేడు భారత మార్కెట్లో విడుదలైంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లే, వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార ఆకారపు మాడ్యూల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో P35 SoC మరియు 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తు మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్ లలో ప్రారంభించబడి అనేక ఆన్‌లైన్ సైట్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y21 ధరలు & సేల్ ఆఫర్స్
భారతదేశంలో వివో Y21 కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతానికి 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ని రూ.15,490 ధర వద్ద లాంచ్ చేసింది. అయితే 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకుకొనివస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ ఫిన్‌సర్వ్ EMI స్టోర్ మరియు అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్లలో నేటి నుండి అందుబాటులో ఉంటుంది. ఇది డైమండ్ గ్లో మరియు మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. లాంచ్ ఆఫర్లలో HDFC బ్యాంక్ కార్డులు మరియు ICICI బ్యాంక్ కార్డులపై రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే జియో కస్టమర్ల కోసం రూ.7,000 వరకు విలువైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ వివో ఫోన్ నో-కాస్ట్ EMI ఎంపికలతో జాబితా చేయబడుతుంది. ఆన్‌లైన్ ఆఫర్‌లలో 9 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు రూ.500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి.

వివో Y21 స్పెసిఫికేషన్స్
వివో Y21 యొక్క స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 పై రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్స్) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు మీడియాటెక్ హీలియో P35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికతో ప్యాక్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి 512GB వరకు సామర్థ్యాన్ని పెంచడానికి స్టోరేజీని మరింత విస్తరించవచ్చు.

వివో Y21 యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. వివో Y21 లో కనెక్టివిటీ ఎంపికలలో USB టైప్-సి పోర్ట్, డ్యూయల్ సిమ్ స్లాట్‌లు (నానో + నానో), 4 జి మరియు మరిన్ని ఉన్నాయి. కొలతలు 164x76x8 మిమీ మరియు ఫోన్ బరువు 182 గ్రాములు. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.


Click it and Unblock the Notifications








