5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Vivo కొత్త ఫోన్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి కొత్త Y సిరీస్ ఫోన్ విడుదలైంది. భారత మార్కెట్‌లో Vivo Y27 పేరిట ఫోన్‌ను లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బాడీ సహా పుల్ HD+ డిస్‌ప్లేతో రానుంది. మరియు ఈ ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది.
వివో Y27 స్మార్ట్‌ఫోన్ 1080*2388 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.64 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 600 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వివో కొత్త ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6GB వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉంటుంది. వివో Y27 స్మార్ట్ ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. మరియు మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ OS13 ఆధారంగా పనిచేస్తుంది. మరియు వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సూపర్ నైట్ మోడ్, సూపర్ నైట్ సెల్ఫీ మోడ్, బోకేష్ ఫ్లేర్ పొర్ట్రెయిట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది.
వివో స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 0 నుంచి 29 శాతం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని వివో సంస్థ చెబుతోంది. వివో Y27 రెండు రంగుల్లో లభించనుంది. బుర్గుండి బ్లాక్, గార్డెన్ గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి ఉంటుంది.
వివో Y27 స్మా్ర్ట్‌ఫోన్ ధర, వివరాలు : ఈ ఫోన్ 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్ ఇవాళ్టి నుంచి (జులై 20) ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా స్టోర్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్ కార్డులను సపోర్టు చేస్తుంది. 164.06mm ఎత్తు, 76.17mm వెడల్పు, 8.07mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ వివో కొత్త ఫోన్ 190 గ్రాముల బరువు ఉంటుంది. WiFi 802.11, GPS, బ్లూటూత్ v5.10, USB టైప్-C, FM రేడియోలను కలిగి ఉంది. ఈ ఫోన్ యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్, మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








