Home
News

Vivo Y28s 5G ఇండియా ధర లీక్ అయింది! లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు

Vivo నుంచి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ తో Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ గత నెలలో కొన్ని మార్కెట్లలో విడుదలైంది. ఇది ప్రస్తుతం కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో పూర్తి స్పెసిఫికేషన్‌ల జాబితా విడుదల చేయబడింది. వివో భారతదేశంలో దాని లభ్యతను ఇంకా నిర్ధారించనప్పటికీ, ఒక టిప్‌స్టర్ ఈ Vivo Y సిరీస్ హ్యాండ్‌సెట్ ధర వివరాలను సూచించారు.

లీక్ అయిన ధర వివరాల ప్రకారం Vivo Y28s 5G దేశంలో బడ్జెట్ ధర ఆఫర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఆవిష్కరించబడిన ఇతర Y సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే, ఇది కూడా 50-మెగాపిక్సెల్ డ్యూయల్ వెనుక కెమెరాలు మరియు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Vivo Y28s 5G India Price Leaked

భారతదేశంలో Vivo Y28s 5G అంచనా ధర వివరాలు
వివో Y28s 5G ధర బేస్ మోడల్ 4GB RAM మరియు 128GB స్టోరేజ్ మోడల్ కోసం భారతదేశంలో రూ.13,999 గా ఉంది. 6GB + 128GB మరియు 8GB + 128GB వేరియంట్‌ల ధర వరుసగా రూ.15,499 మరియు రూ.16,999 గా ఉంటుంది.

ఈ ఫోన్ మలేషియాలో ఇదివరకే లాంచ్ అయింది, కాబట్టి ధరలు Vivo Y28s 5G ధర 12GB + 128GB స్టోరేజ్ మోడల్‌కు RM 799 (దాదాపు రూ. 14,000) మరియు 16GB + 256GB స్టోరేజ్ మోడల్‌కి RM 999 (18,000). దీని ఆధారంగా, హ్యాండ్‌సెట్ ధర భారతదేశంలో సుమారు రూ. 15,000 లలో ఉండవచ్చని అంచనా. ఇది మోచా బ్రౌన్ మరియు ట్వింక్లింగ్ పర్పుల్ రంగులలో వస్తుంది.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్ల వివరాలు
వివో Y28s 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 పై పనిచేస్తుంది. మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 840nits ప్రకాశంతో 6.56-అంగుళాల HD+ (720x1,612 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 8GB LPDDR4X RAM మరియు 256GB eMMC 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిన మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై నడుస్తుంది. అలాగే, ఉపయోగించని అదనపు స్టోరేజీ ని ఉపయోగించి ర్యామ్‌ను వర్చువల్‌గా 16GB వరకు విస్తరించవచ్చు.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, వివో Y28s 5G స్మార్ట్‌ఫోన్ 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం, ఇది ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP64-రేటింగ్ ను కలిగి ఉంది.

వివో Y28s 5G లోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, 5G, 3.5mm ఆడియో జాక్, GPS, Beidou, GLONASS, గెలీలియో, QZSS మరియు USB టైప్-సి కనెక్టివిటీ ఉన్నాయి. ఇది ఎంచుకున్న ప్రాంతాలలో NFC ని కూడా అందిస్తుంది. ఇది ప్రామాణీకరణ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు కలర్ టెంపరేచర్ సెన్సార్లు కూడా ఉన్నాయి. వివో Y28s 5G స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం దీని బరువు 185 గ్రాములు ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y28s 5G India Price Leaked Ahead Of Expected Launch Date. Expected Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X