వివో Y33s స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్లలో అద్భుతమైన క్యాష్‌బ్యాక్!! మిస్ చేయకండి...

|

వివో బ్రాండ్ యొక్క Y33 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్తగా బడ్జెట్ విభాగంలో స్నేహపూర్వక ఆఫర్‌గా వివో Y33s ను నేడు భారతదేశంలో విడుదలైంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో SoC ద్వారా శక్తిని పొందుతూ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటుగా డిస్‌ప్లే చుట్టూ మందపాటి బెజెల్స్ నిర్మాణంను కలిగి ఉండి రెండు కలర్ ఎంపికలలో మరియు ఒకే కాన్ఫిగరేషన్‌లో లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y33s స్మార్ట్‌ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ ఒకే ఒక మోడల్ లో లభించే వేరియంట్ యొక్క ధర రూ.17,990. ఇది మిడ్ డే డ్రీమ్ మరియు మిర్రర్ బ్లాక్ కలర్ లలో అందించబడుతుంది. ఈ ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ ఫిన్‌సర్వ్ EMI స్టోర్ మరియు అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వివో మెయిన్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆన్‌లైన్ ఆఫర్‌లు అదనంగా తొమ్మిది నెలల వరకు ఎక్స్ఛేంజ్‌పై రూ.1,500 తగ్గింపు అలాగే నో-కాస్ట్ EMI ఎంపికలు ఉన్నాయి.

వివో Y33s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో Y33s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో Y33s స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా మరియు ఫన్‌టచ్ ఓఎస్ 11.1 తో రన్ అవుతుంది. అలాగే ఇది 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఎల్‌సిడి డిస్‌ప్లేను 1,080x2,408 పిక్సెల్స్ తో కలిగి ఉంటుంది. ఇది హుడ్ కింద మీడియాటెక్ హెలియో G80 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM మరియు 4GB విస్తరించిన ర్యామ్‌తో పాటుగా 128GB స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది.

ఆప్టిక్స్

వివో Y33s స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఒక f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు f/2.4 లెన్స్ తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చరుతో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 4G, బ్లూటూత్ v5, NFC, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, ఇ-కంపాస్ మరియు గైరోస్కోప్ వంటివి ఉన్నాయి. వివో వై 33 లలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఫేస్ అన్‌లాక్ ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కొలతల పరంగా ఇది 164.26x76.08x8 మిమీ లతో 182 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo Y33s Smartphone Released in India With MediaTek Helio G80 SoC: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X