Home
News

Vivo Y36 స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 8GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీ సహా..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తన కొత్త మిడ్‌లెవల్‌ y సిరీస్‌ ఫోన్‌ Vivo Y36 4Gను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లపై గత కొన్ని రోజులుగా అనేక లీకేజీలు వచ్చాయి. అయితే ఈ ఫోన్‌ 5G సపోర్టు లేదు. కానీ అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది. భారీ డిస్‌ప్లే, శక్తివంతమైన ర్యా్మ్‌, భారీ బ్యాటరీ, మరియు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది.

వివో Y36 4G స్మార్ట్‌ఫోన్ 6.64 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. 2388*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. టియర్‌డ్రాప్ బెజెల్‌ మరియు చిన్న బెజెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రోసెసర్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఫన్‌టచ్‌OS 13పై ఆధారపడి పనిచేస్తుంది.

Vivo Y36 4G Smartphone launched in india

వివో Y36 4G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా మరియు f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌ ముందు వైపు సెల్ఫీల కోసం వివిధ షూటింగ్ మోడళ్లతో కూడిన 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు 5.1 బ్లూటూత్‌ కనెక్టివిటీ, టైప్‌-సీ పోర్టును కలిగి ఉంటుంది.

వివో Y36 4G స్మార్ట్‌ఫోన్‌ 5000mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. ఫలితంగా వేగంగా ఛార్జింగ్‌ కానుంది. వివో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ మరియు 128GB వేరియంట్‌ ధర రూ.16,999కు అందుబాటులో ఉంది. మరియు వివో ఈ-స్టోర్‌లో ఈ ఫోన్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. మెటీరియర్‌ బ్లాక్‌, వైబ్రంట్‌ గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది.

Vivo Y36 4G Smartphone launched in india

ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 500 డిస్కౌంట్‌ పొందనున్నారు. ఈ ఆఫర్‌ జూన్‌ నెల చివర వరకు ఉంటుందని వివో తెలిపింది. మరియు నోకాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉందని వివో పేర్కొంది. 15 రోజుల వరకు ఫోన్‌ను రీప్లెస్‌మెంట్‌ చేసుకునే అవకాశాన్ని కూడా వివో కల్పించింది.

వివో Y36 స్మార్ట్‌ఫోన్‌లో 5G సపోర్టు మినహాయిస్తే, చాలా వరకు మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ధర కూడా అందుబాటులో ఉంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి రాలేదు. మరియు కొన్ని గ్రామీణ ప్రాంతాలకు 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y36 4G Smartphone launched in India with 8GB ram variant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X