Home
News

Vivo Y50 & S1 Pro స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీ ధర తగ్గింపు!!!

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన వివో సంస్థ ఇంతకు ముందు విడుదల చేసిన రెండు స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌లు వివో S1 ప్రో మరియు వివో Y50 యొక్క ధరలను మరోసారి తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అసలు ధర కంటే రూ.1,000 తక్కువ ధర వద్ద వినియోగదారులు ప్రస్తుతం దీనిని కొనుగోలు చేయవచ్చు. వివో బ్రాండ్ ధర తగ్గింపును అందించిన మిడ్ మరియు బడ్జెట్ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో S1 ప్రో & Y50 తగ్గింపు ధరల వివరాలు

వివో S1 ప్రో & Y50 తగ్గింపు ధరల వివరాలు

వివో S1 ప్రో స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను ఇప్పుడు రూ.19,990 కు బదులుగా రూ.18,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిని డిమ్మీ వైట్, జాజీ బ్లూ మరియు మిస్టిక్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలో కొనుగోలు చెయవచ్చు. అలాగే వివో Y50 ను కూడా ప్రస్తుతం రూ.17,990 కు బదులుగా రూ.16,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఐరిస్ బ్లూ మరియు పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ తగ్గింపు ధరలు సంస్థ యొక్క అధికారిక దుకాణాలతో పాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు మరియు రిటైల్ దుకాణాలలో ఇప్పటికే అమలులో ఉంది.

వివో Y50 స్మార్ట్‌ఫోన్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా స్పెసిఫికేషన్స్

వివో Y50 స్మార్ట్‌ఫోన్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా స్పెసిఫికేషన్స్

వివో Y50 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.53-అంగుళాల iView డిస్ప్లే ప్యానల్‌ను 90.7 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉంటుంది. అలాగే ఇది శక్తివంతమైన 5,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటి కెమెరా 13MP సెన్సార్‌తో వస్తుంది. ఇది కాకుండా ఫోన్‌లో 8MP సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా, 2MP బోకె సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఫోన్‌లో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వివో S1 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఫీచర్స్

వివో S1 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఫీచర్స్

వివో S1 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ప్యానల్‌ను 90HZ స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉండగా ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo Y50 and Vivo S1 Pro Smartphones Price Slashed in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X