Vivo Y53s స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
వివో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Y-సిరీస్‌లో భాగంగా తాజా వివో Y53s మోడల్‌ను నేడు భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త వివో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు వాటర్‌డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది. వివో Y53s యొక్క ఇతర ముఖ్య ముఖ్యాంశాలలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 128GB ఆన్బోర్డ్ స్టోరేజ్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ మరియు శామ్‌సంగ్ గెలాక్సీ M51 వంటి వాటికి గట్టి పోటీని ఇచ్చే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y53s ధరల వివరాలు
భారతదేశంలో వివో Y53s కేవలం ఒకే ఒక వేరియంట్ లో విడుదలైంది. 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ లో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.19,490. ఈ ఫోన్ డీప్ సీ బ్లూ మరియు ఫెంటాస్టిక్ రెయిన్‌బో వంటి కలర్ ఎంపికలలో వస్తుంది. దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ EMI స్టోర్ మరియు వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు అన్ని ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌లలో నేటి నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

వివో Y53s లాంచ్ ఆఫర్స్
వివో Y53s లాంచ్ ఆఫర్లలో HDFC బ్యాంక్ డెబిట్/ క్రెడిట్ కార్డులు మరియు EMI లావాదేవీలపై రూ.1,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.7000 విలువైన జియో ప్రయోజనాలు కూడా అదనంగా ఉంటాయి. ఇంకా వినియోగదారులు నో-కాస్ట్ EMI ఎంపికలను పొందుతారు. ఆన్‌లైన్ ఛానెల్‌లకు అదనంగా రూ. 1,500 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మరియు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా లభిస్తుంది.

వివో Y53s స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ తో లభించే వివో Y53s స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 పై ఫన్‌టచ్ OS11.1 తో రన్ అవుతుంది. అలాగే ఇది 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, స్టాండర్డ్ 60HZ రిఫ్రెష్ రేట్‌తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ MediaTek Helio G80 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జతచేయబడి ఉంటుంది. వివో 3GB 'ఎక్స్‌టెండెడ్ ర్యామ్' ని కూడా అందించింది. ఇది తప్పనిసరిగా మల్టీ టాస్కింగ్ కోసం ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగిస్తుంది.

వివో Y53s స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం f/2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

వివో Y53s 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని మరింత విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, Bluetooth v5.0, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేయబడి అందిస్తుంది. ఇది కాకుండా ఫోన్ 164x75.46x8.38 మిమీ కొలతలతో 190 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








