Home
News

Vivo Y55 4G ఫోన్ ప్రత్యేకమైన ఛార్జింగ్ ఫీచర్లతో లాంచ్ అయింది!!

వివో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సంస్థ నేడు కొత్తగా వివో Y55 4G ను వియత్నాంలో లాంచ్ చేసింది. వివో Y55 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని పొందుతూ ఉంటే ఈ కొత్త 4G వేరియంట్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC చిప్ సెట్ తో అమర్చబడి ఉంది. ఇది భారతదేశంలో ఇప్పటికే విడుదలైన iQoo Z6 44W స్మార్ట్‌ఫోన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తు ప్రస్తుతం ఒకే కాన్ఫిగరేషన్ ఎంపికలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందో అన్న దాని గురించి వివో సంస్థ ఇంకా ఎటువంటి వివరణను ఇవ్వలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vivo Y55 4G ధరల వివరాలు

Vivo Y55 4G ధరల వివరాలు

వివో Y55 4G ప్రస్తుతం వియత్నాంలో మాత్రమే విడుదల చేయబడింది. 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపిక మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర VND 6,990,000 (దాదాపు రూ. 23,300). Vivo ప్రస్తుతం బ్లాక్ స్టార్ మరియు స్నో వైట్ కలర్ ఆప్షన్‌లను మాత్రమే అందిస్తోంది.

వివో Y55 4G స్పెసిఫికేషన్స్

వివో Y55 4G స్పెసిఫికేషన్స్

వివో Y55 4G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది వివో Y55 5G నుండి కొద్దిగా భిన్నంగా స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAMతో లభిస్తుంది. అలాగే ఇది ఫుల్-HD+ (2,400x1,080 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 408ppi మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.44-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4GB పొడిగించిన RAMని యాక్టివేట్ చేసే ఎంపికతో లభిస్తూ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ OS 12 పై రన్ అవుతుంది.

ఆప్టిక్స్

ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.4 ఎపర్చరుతో రెండు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇంకా వీడియో కాల్ మరియు సెల్ఫీల కోసం ముందుభాగంలో f/2.0 ఎపర్చరుతో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చబడి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి ఇది 18 గంటల వరకు నిరంతరాయంగా వీడియో స్ట్రీమింగ్ సమయాన్ని అందిస్తుంది. ఇది 28 నిమిషాలలోనే 50 శాతం వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-బ్యాండ్ వై-ఫై మరియు బ్లూటూత్ v5.0 టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. USB టైప్-C పోర్ట్ మరియు హ్యాండ్‌సెట్ దిగువన 3.5mm ఆడియో జాక్ కూడా ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y55 4G Smartphone Launched With 44W Fast Charging, 5,000mAh Battery: Price, Specs, India Price, India Launch Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X