44-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫీచర్లతో వివో Y75 కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

|

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నేడు భారతదేశంలో Y-సిరీస్ విభాగంలో వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వివో ఫోన్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉండి రెండు విభిన్న కలర్ ఎంపికలలో అందించబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G96 SoC ద్వారా శక్తిని పొందుతూ 128GB ఇన్‌టర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అదనంగా 44-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 44W ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 4,050mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇంకా హ్యాండ్‌సెట్ కలిగి ఉన్న అద్భుతమైన ఫీచర్‌ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

భారతదేశంలో వివో సంస్థ తన యొక్క Y-సిరీస్ లోని కొత్త వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.20,999. ఈ ఫోన్ డ్యాన్సింగ్ వేవ్స్ మరియు మూన్‌లైట్ షాడో వంటి కలర్ లలో లభిస్తుంది. ఇది ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ICICI, SBI, IDFC బ్యాంక్ మరియు OneCard యొక్క కార్డ్‌లను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు గరిష్టంగా రూ.1,500 వరకు తగ్గింపును కూడా పొందుతారు.

Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ మూడు నెలల వాలిడిటీను కేవలం రూ.151 ధరకే పొందవచ్చు!!Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ మూడు నెలల వాలిడిటీను కేవలం రూ.151 ధరకే పొందవచ్చు!!

వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్
 

వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఫన్ టచ్ OS 12పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.44 అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంది. ఈ ఫోన్ హుడ్ కింద మీడియాటెక్ హీలియో G96 4G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAMతో జత చేయబడి వస్తుంది. ఇది ఇన్‌బిల్ట్ స్టోరేజీని ఉపయోగించి RAMని 4GB వరకు పొడిగించడానికి అనుమతిస్తుంది.

ఆప్టిక్స్

వివో Y75 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ఫ్లాష్‌తో పాటుగా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ కెమెరా యూనిట్‌లో f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.2 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ డెప్త్ సెన్సార్ మరియు f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 44-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కెమెరాలు అల్ట్రా-వైడ్ నైట్, సూపర్ మాక్రో, పోర్ట్రెయిట్ మోడ్, లైవ్ ఫోటో మరియు బోకె మోడ్‌ల జాబితాతో ప్రీలోడ్ చేయబడి వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరించవచ్చు.

కనెక్టివిటీ

వివో Y75 స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS, BEIDOU, GLONASS, GALILEO, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు ఇ-కంపాస్ వంటివి ఉన్నాయి. ఫోన్ యాక్సిస్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 44W ఫ్లాష్ ఛార్జింగ్‌ మద్దతుతో పాటుగా 4,050mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి మూన్‌లైట్ షాడో మరియు డ్యాన్సింగ్ వేవ్స్ వంటి రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo Y75 Smartphone Launched in India With 44-Megapixel Selfie Camera Features: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X