16-MP సెల్ఫీ కెమెరాతో వివోZ3x

Vivo Z3x అనేది వివో Z1 యొక్క అప్గ్రేడ్ గా చైనాలో ప్రారంభించబడింది. ఈ కొత్త ఫోన్ స్నాప్ డ్రాగన్660 SoC మరియు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో వస్తుంది.

|

Vivo Z3x అనేది వివో Z1 యొక్క అప్గ్రేడ్ గా చైనాలో ప్రారంభించబడింది. ఈ కొత్త ఫోన్ స్నాప్ డ్రాగన్660 SoC మరియు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో వస్తుంది. గత సంవత్సరం Z1 లాగానే వివో Z3x 6.26-inch ఫుల్HD + డిస్ప్లేను కలిగి ఉంది మరియు సాంప్రదాయ నాచ్ డిజైన్ తొ వస్తుంది.

vivo z3x price cny 1198 launch specifications

వివో తన స్వంత యాజమాన్య సెట్లను గేమ్ టర్బో మరియు సిస్టం టర్బోతో సహా అందిస్తుంది. వివో Z3x యొక్క ఇతర కీలక ముఖ్యాంశాలు వెనుక డ్యూయల్ కెమెరా సెటప్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(AI) ట్వీక్స్, వెనుకవైపు మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఆండ్రాయిడ్ పై ఆధారపడిన Funtouch OS 9 ఉంటాయి.

Vivo Z3x ధర:

Vivo Z3x ధర:

చైనాలో వివో Z3x ధర CNY 1,198 (సుమారుగా రూ.12,400) 4GB RAM + 64GB వేరియంట్ కోసం సెట్ చేయబడింది. రెడ్, పర్పుల్, మరియు బ్లాక్ కలర్ ఫోన్లతో ఫోన్ మే 1 నుంచి ముందస్తు ఆర్డర్స్ పొందవచ్చు.

వివో దాని ఆన్లైన్ స్టోర్ ద్వారా Z3x కోసం ఇప్పటికే రిజర్వేషన్లు తీసుకుంటోంది అయితే దానిని అధికారికంగా మే 8 వ తేదీ నుంచి వినియోగదారులకు అందిస్తుంది. గత సంవత్సరం మే నెలలో వివోZ1 CNY 1,798 (సుమారుగా రూ.18,600)వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

 

Vivo Z3x స్పెసిఫికేషన్స్ &ఫీచర్స్ :

Vivo Z3x స్పెసిఫికేషన్స్ &ఫీచర్స్ :

డ్యూయల్-సిమ్ (నానో) వివో Z3x, Android Pie Funtouch OS 9 తో నడుస్తుంది మరియు 19: 9 కారక నిష్పత్తిలో 6.26-అంగుళాల ఫుల్ -HD + (1080x2280 పిక్సెల్స్) TFT డిస్ప్లే ను కలిగి ఉంది.మరియు హుడ్ కింద ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్660 SoC, 4GB RAM తో జత చేయబడి ఉంటుంది.

కెమెరా

కెమెరా

ఫోటోలు మరియు వీడియోల కోసం వివో Z3x వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది ఇది f / 2.2 లెన్స్తో 13-మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ను f / 2.4 లెన్స్ తొ ఉంటుంది. f / 2.0 లెన్స్ తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఫోన్ కూడా AR మోడ్, పోర్ట్రైట్ మోడ్, డైనమిక్ ఫోటో, మరియు బ్యూటీ మోడ్ వంటి లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా కొత్త మోడల్ AI అల్గోరిథంలను ఉపయోగించి ఆప్టిమైజ్ చేయడానికి 22 సన్నివేశాలను మరియు 240 సన్నివేశాలను కలపడానికి సామర్థ్యం కలిగివుందని వివో ప్రకటించింది.

 కనెక్టువిటీ ఎంపికలు

కనెక్టువిటీ ఎంపికలు

Vivo Z3x 64GB ఇంటర్నల్ స్టోరేజి మరియు మెమరీ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ మద్దతుతో 256GB వరకు ఎక్సపాండ్ చెయ్యవచ్చు. కనెక్టువిటీ ఎంపికలు 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS, OTG మద్దతుతో మైక్రో- USB మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్లో సెన్సార్లలో యాక్సలెరోమీటర్,ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ప్రాక్సిమిటి సెన్సార్ లు ఉన్నాయి.

Vivo Z3x లో 3,260mAh బ్యాటరీని అందిస్తోంది. అంతేకాకుండా ఫోన్ 154.81x75.03x7.89 mm మరియు 150 గ్రాముల బరువును కలిగి ఉంది.

 

Best Mobiles in India

English summary
vivo z3x price cny 1198 launch specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X