వివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభం

|

వివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు చైనాలో లాంచ్ చేశారు. ఈ హ్యాండ్‌సెట్ వివో యొక్క Z- సిరీస్ పరిధిలోకి వస్తుంది. స్పెసిఫికేషన్ల విషయంలో ఇది వివో U3 మాదిరిగానే ప్యాక్ చేయబడి వస్తుంది. కొత్తగా ప్రారంభించిన వివో Z 5i క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.53-inch డిస్ప్లే , ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి మరెన్నో ఫీచర్స్ లను కలిగి ఉన్నాయి. వివో Z5i యొక్క ధర వంటి మరిన్ని ఇతర వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధర వివరాలు
 

ధర వివరాలు

కొత్తగా ప్రారంభించిన వివో Z 5i కేవలం ఒకే ఒక వేరియంట్ లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర RMB 1,798. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.18,300 గా ఉంటుంది. వివో యొక్క ఈ పరికరాన్ని బ్లూ మరియు ఒనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం చైనాలో వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఇది కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Oppo ColorOS 7 అప్డేట్ ఫీచర్స్ ఏమిటో అవి ఎలా ఉన్నాయో తెలుసా?

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

కొత్తగా లాంచ్ చేసిన వివో జెడ్ 5 ఐ వెనుకవైపు మూడు కెమెరాల ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.78 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా కలిగి ఉన్నాయి. ఈ కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మూడవ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు తీయడానికి మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ కెమెరాను ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా షియోమి Mi చిల్డ్రన్స్ వాచ్ 2S

డిస్ప్లే
 

ఈ స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080 × 2340 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 19.5: 9 కారక నిష్పత్తిని కలిగి ఉండి 90.30 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. వివో Z5i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 పైతో ఫన్‌టచ్ OS 9.2 తో రన్ అవుతుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC చేత ఆధారపడి పనిచేస్తుంది. వివో సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ ను కేవలం ఒకే ఒక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తోంది.

5G టెక్నాలజీ ప్రొసెసర్ ల్యాప్‌టాప్‌లను అందించే ప్రయత్నంలో ఇంటెల్‌ & మీడియాటెక్

బ్యాటరీ

ఇందులో వున్న ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే వివో జెడ్ 5i లో 4G LTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు ప్రొటెక్షన్ కోసం వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉంది. ఇవి కాకుండా వివో జెడ్ 5 ఐ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతును కలిగి ఉంది.

Vivo U20 Sale : గొప్ప ఆఫర్లతో అమెజాన్ లో రేపటి నుండి అమ్మకాలు

వివో U20

వివో U20

వివో సంస్థ ఇండియాలో ఇటీవల వివో U20 స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసారు. ఇప్పుడు ఇది మొదటి సారిగా అమెజాన్ మరియు తన అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి ఉంచింది. వివో U20 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని బేస్ మోడల్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.10,990. మరియు 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.11,990. వివో యొక్క తాజా ఫోన్ రేసింగ్ బ్లాక్ మరియు బ్లేజ్ బ్లూ కలర్ ఎంపికలలో లభిస్తుంది. వీటి కొనుగోలు మీద అమెజాన్ లో బ్రహ్మాండమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ వివరాలు తెలుసుకోవడానికి పైన సూచించిన లింక్ మీద క్లిక్ చేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo Z5i Smartphone Launched: Price, Specifications, Availability Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X