'విఎల్‌సి ప్లేయర్ కొత్త వర్సన్ 2.0'ని డౌన్‌లోడ్ చేసుకున్నారా..?

Posted By: Prashanth

'విఎల్‌సి ప్లేయర్ కొత్త వర్సన్ 2.0'ని డౌన్‌లోడ్ చేసుకున్నారా..?

 

ఇంట్లో కంప్యూటర్ ఉందంటే చాలా మందికి తప్పని సరిగా 'విఎల్‌సి ప్లేయర్' గురించి తెలిసే ఉంటుంది. ఏదో ఒక సందర్బంలో సినిమాలు చూసేందుకో లేదా పాటలు వినేందుకో దీనిని మీ కంప్యూటర్లో ఇనిస్టాల్ చేసుకోని ఉండి ఉంటారు. విఎల్‌సి ప్లేయర్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకోని మార్కెట్లోకి కొత్తగా విఎల్‌సి ప్లేయర్ వర్సన్ 2.0 డౌన్ లోడ్‌ని నెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. డెస్క్ టాప్స్ కంప్యూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన విఎల్‌సి ప్లేయర్ కొత్త వర్సన్ అన్ని రకాల ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

విఎల్‌సి ప్లేయర్ వర్సన్ 2.0ని అధికారకంగా వెబ్‌సైట్ ద్వారా డౌన్ లౌడ్ చేసుకోని ఉపయోగించుకోవచ్చు. విఎల్‌సి ప్లేయర్ వర్సన్ 2.0లో ఉన్న కొత్త ఫీచర్ ఏమిటంటే హార్డ్ వేర్‌ని యాక్సలరేట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఉండడం వల్ల మల్టీమీడియా కంటెంట్‌ని హై క్వాలిటీతో ఎంజాయ్ చేయవచ్చు. దీనితో పాటు ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను సపోర్ట్ చేసే విఎల్‌సి ప్లేయర్‌ని త్వరలో రూపొందించున్నారు. ఇదే గనుక జరిగితే మొబైల్ ‌ఫోన్స్‌లో కూడా మల్టీ మీడియా కంటెంట్‌ని హమ్ చేయవచ్చు.

విఎల్‌సి ప్లేయర్ వర్సన్ 2.0ని ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోండి

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot