వొడాఫోన్ సిమ్ ఆర్డర్ చేస్తే ఉచితంగా మీ ఇంటికే డోర్ డెలివరీ
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులను ఆర్డర్ చేసిన వారికి ఉచిత డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే వొడాఫోన్ ప్రీపెయిడ్ సిమ్‌లకు
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులను ఆర్డర్ చేసిన వారికి ఉచిత డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే వొడాఫోన్ ప్రీపెయిడ్ సిమ్‌లకు గాను ఉచిత డోర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో వొడాఫోన్ ప్రీపెయిడ్ 4జీ సిమ్‌ను ఆర్డర్ చేస్తే వారికి ఆ సిమ్‌ను ఉచితంగా డోర్ డెలివరీ ఇస్తారు. అయితే ఇందుకోసం యూజర్లు వొడాఫోన్ ప్లాన్ లోకి మారాల్సి ఉంటుంది. సిమ్ ఉచిత డోర్ డెలివరీ పొందాలంటే వారు రూ.249 రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.దాంతో వారికి రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.

కాగా వొడాఫోన్ సిమ్‌ను ఆర్డర్ చేయాలంటే కస్టమర్లు తొలుత ఆ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో ప్రీపెయిడ్ సిమ్ విభాగంలో ఉండే బై నౌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ వెంటనే యూజర్‌కు సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం అడిగి, కొత్త నంబరు కావాలా? లేక ఉన్న నంబరునే ఎంఎన్‌పీ చేయాలా? అని అడుగుతుంది.

ఎంఎన్‌పీ చేయించుకోవాలనుకుంటున్న నంబరును
మొదటి ఆప్షన్ ఎంచుకుంటే కొన్ని నంబర్లు చూపిస్తుంది. అందులోంచి ఓ నంబరును ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండో ఆప్షన్‌లో మీరు ఎంఎన్‌పీ చేయించుకోవాలనుకుంటున్న నంబరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది.అయితే కొత్త సిమ్ మాత్రమే కాకుండా, ఇప్పటికే వినియోగంలో ఉన్న ఇతర నెట్‌వర్క్‌కు చెందిన సిమ్‌ను కూడా ఎంఎన్‌పీలో వొడాఫోన్‌లోకి మార్చుకోవచ్చు.

రూ.249 రీఛార్జ్
అలా మార్చుకున్నా సిమ్‌ను డోర్ డెలివరీ చేస్తారు. సిమ్‌కార్డును డెలివరీ చేయాల్సిన అడ్రస్‌ను పూర్తి చేసిన తర్వాత ప్రీపెయిడ్ ప్యాక్ ధర అయిన రూ.249ను చెల్లించాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక సిమ్‌కార్డును ఉచితంగా మీ ఇంటికి పంపిస్తుంది.

రూ.129, రూ.159, రూ.169 ప్లాన్‌లు
వొడాఫోన్‌లో ఇప్పటికే రూ.129, రూ.159, రూ.169 ప్లాన్‌లు ఉండగా రూ.139తో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు ఉచిత రోమింగ్ లభిస్తుంది. 2జీబీ 4జీ/3జీ డేటా లభిస్తుంది. అలాగే వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితమే. కాలపరిమితి 28 రోజులు.దీంతో పాటు రూ139 ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. సబ్‌స్క్రైబర్లు వొడాఫోన్ రూ.139 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 5 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలో ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

రూ.16 ప్రిపెయిడ్ ప్లాన్
ఇకపోతే వొడాఫోన్ కంపెనీ ఇటీవలే రూ.16 ప్రిపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 1 జీబీ డేటా పొందొచ్చు. ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే. ఇందులో ఎలాంటి వాయిస్ కాల్స్ సౌకర్యం ఉండదు.

వొడాఫోన్ 999 రీచార్జ్ ప్లాన్
వొడాఫోన్ 999 రీచార్జ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అయితే ఈ ప్లాన్ కేవలం 12 జీబీ డేటాను మాత్రమే అందిస్తోంది.ప్రస్తుతం ఈ ప్లాన్ పంజాబ్ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర సర్కిళ్లలోనూ అందుబాటులోకి రావొచ్చు. ఇకపోతే వొడాఫోన్ 999 ప్లాన్‌లో ఎలాంటి టాక్‌టామ్ రాదు. అయితే వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఉచితంగా పొందొచ్చు.


Click it and Unblock the Notifications








