Home
News

రోజుకు 3జిబి డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, వొడాఫోన్ రెండు కొత్త ఆఫర్లు

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మొబైల్ సంస్థ వొడాఫోన్ సరికొత్తగా రెండు ప్లాన్లను ఆవిష్కరించింది.రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 511, రూ.569 ప్లాన్లను ప్రవేశపెట్టింది.

By Hazarath Aiah

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మొబైల్ సంస్థ వొడాఫోన్ సరికొత్తగా రెండు ప్లాన్లను ఆవిష్కరించింది. రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 511, రూ. 569 ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ద్వారా ప్రతిరోజు 3జీబీ డేటాను 3జీ/4జీ వినియోగదారులు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని వొడాఫోన్ కంపెనీ స్పష్టం చేసింది.రూ.511తో రీచార్జ్ చేసుకుంటే, అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. నెట్ వర్క్ అందుబాటును బట్టి ప్రతి రోజూ 2జీబీ 3జీ లేదా 4జీ డేటాలో దేన్ని అయినా పొందొచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ. అలాగే, రూ.569తో రీచార్జ్ చేసుకుంటే అన్ని కాల్స్ ఉచితంతోపాటు ప్రతి రోజూ 3జీబీ 3జీ లేదా 4జీ డేటా పొందొచ్చు. ఇందులోనూ రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితమే. వ్యాలిడిటీ 84 రోజులు. ప్రస్తుతం ఈ ఆఫర్లు ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది.

vodafone

కాగా ఇప్పటికే 799 రూపాయలతో సరికొత్త ప్యాక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌ డైరెక్ట్‌ జియో రూ.799 ప్లాన్‌కు పోటీగా ఉంది. జియో తన రూ.799 ప్లాన్‌ కింద రోజుకు 5జీబీ డేటా ఆఫర్‌ చేస్తుండగా... దీని కంటే 0.5 జీబీ తక్కువగా రోజుకు 4.5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు వొడాఫోన్‌ తెలిపింది. ఈ ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు. దీంతో మొత్తంగా 28 రోజుల పాటు 126 జీబీ డేటా యూజర్లకు లభించనుంది. అదనంగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్స్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభించనున్నాయి.

దీంతో పాటు రూ.549తో కూడా వొడాఫోన్‌ మరో ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 3.5జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు. మొత్తంగా యూజర్లకు 28 రోజులకు 98జీబీ డేటా అందుబాటులోకి రానుంది.

vodafone

అలాగే వొడాఫోన్‌ ఇటీవలే రూ.158 ప్లాన్‌ను పునరుద్ధరించింది. ఈ ప్లాన్‌ కింద కూడా 28 రోజులకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 3జీ లేదా 4జీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌పై రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్‌ కూడా డైరెక్ట్‌ జియో రూ.149 ప్లాన్‌కు గట్టి పోటీగా ఉంది.

ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూ.151 సూపర్‌ప్లాన్‌ను కూడా వొడాఫోన్‌ ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్లాన్స్‌ కూడా కేవలం కేరళ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vodafone Rs. 511, Rs. 569 Packs Offer Up to 3GB Daily Data for 84 Days More news at GIzbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X