Vodafone యొక్క కొత్త Rs.95ల ఆల్ రౌండర్ ప్యాక్ ఆఫర్స్ బ్రహ్మాండం

|

వోడాఫోన్ సంస్థ ఎంపిక చేసిన కొన్ని సర్కిళ్లలో రెండు నెలలపాటు టాక్ టైమ్, డేటా మరియు రేట్ కట్టర్ ప్రయోజనాలతో కొత్తగా రూ.95 ఆల్ రౌండర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. వోడాఫోన్ నుండి వచ్చిన అన్ని ఆల్ రౌండర్ ప్లాన్‌లు అకౌంట్ యొక్క సర్వీస్ వాలిడిటీను విస్తరించడానికి వినియోగదారుల కోసం ఉంచిన కనీస రీఛార్జ్ ప్యాక్‌లు. ఇందులో మొదటి ప్లాన్ రూ.49 ఆల్ రౌండర్ ప్లాన్ వోడాఫోన్ యూజర్ అకౌంట్ యొక్క వాలిడిటీని 28 రోజులపాటు పొడిగిస్తుంది.

ఆల్ రౌండర్ ప్లాన్
 

ఆల్ రౌండర్ ప్లాన్

కొత్తగా ప్రారంభించిన రూ.95 ఆల్ రౌండర్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న రూ.39, రూ.49 మరియు రూ .79 జాబితాలో చేరింది. అయితే రూ.95 ప్యాక్ ప్రస్తుతానికి ఎంపిక చేసిన సర్కిల్‌లలో మాత్రమే లభిస్తుంది. ఈ క్రొత్త ప్లాన్ ఉత్తమమైన ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. అపరిమిత కాంబో ప్లాన్ కోసం వెళ్లకుండా వారి ప్రీపెయిడ్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక. వోడాఫోన్ యొక్క కొత్త రూ.95 ఆల్ రౌండర్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ రూ.95 ఆల్ రౌండర్ ప్యాక్ ప్రయోజనాలు

వోడాఫోన్ రూ.95 ఆల్ రౌండర్ ప్యాక్ ప్రయోజనాలు

వోడాఫోన్ సంస్థ అందిస్తున్న ఇతర ఆల్ రౌండర్ ప్లాన్‌ల మాదిరిగానే రూ.95 ప్లాన్ డేటా, టాక్ టైమ్ మరియు వాయిస్ కాలింగ్ రేట్ కట్టర్ అనే మూడు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రూ.74 టాక్ టైమ్ ప్రయోజనాలలో అన్ని స్థానిక / జాతీయ కాల్స్ సెకనుకు 2.5 పైసలు వసూలు చేయబడతాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అదనంగా 200MB డేటాను రీఛార్జ్ తేదీ నుండి 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

సవరణకు ముందు గల ఈ ప్యాక్ తేడాలు

సవరణకు ముందు గల ఈ ప్యాక్ తేడాలు

వోడాఫోన్ 2019 డిసెంబర్‌లో ధరల సవరణకు ముందు రూ.95 ఆల్ రౌండర్ ప్లాన్‌ను అందించేది. అప్పుడు ఈ ప్లాన్ రూ .95ల ఫుల్ టాక్ టైమ్ బెనిఫిట్ ప్రయోజనం మరియు స్థానిక మరియు జాతీయ కాల్ ఛార్జీలలో సెకనుకు ఒక పైసా చొప్పున వసూలు చేసేవి. అదనంగా ఇది 500MB డేటాను 28 రోజుల వాలిడిటీ కాలానికి అందించింది. కొత్త రూ.95 ఆల్ రౌండర్ ప్యాక్యొక్క తేడాల విషయానికొస్తే రూ.95 ఆల్ రౌండర్ ప్లాన్ యొక్క చెల్లుబాటును ఇప్పుడు పెంచారు. అయితే కంపెనీ డేటా ప్రయోజనాన్ని సగానికి పైగా తగ్గించింది.

లభ్యత
 

లభ్యత

వోడాఫోన్ రూ.95 కొత్త ఆల్ రౌండర్ ప్లాన్ యొక్క లభ్యత విషయానికి వస్తే ఇది ప్రస్తుతం బీహార్, చెన్నై, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ముంబై, తమిళనాడు సర్కిల్‌లలోని వోడాఫోన్ వినియోగదారులు దీనిని పొందవచ్చు. ఈ సర్కిల్స్‌లోని ఐడియా కస్టమర్లకు కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

వోడాఫోన్ అన్ని రౌండర్ ప్లాన్‌లు

వోడాఫోన్ అన్ని రౌండర్ ప్లాన్‌లు

టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ARPU ని పెంచడానికి 2018 లో ‘కనీస రీఛార్జ్' పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఇందులో భాగంగా వారు కనీస రీఛార్జ్ ప్లాన్‌లను (వోడాఫోన్ ఐడియా విషయంలో ఆల్ రౌండర్ ప్లాన్‌లు) ప్రారంభించారు. ఈ ప్లాన్ ల యొక్క USP బడ్జెట్లో సర్వీస్ యాక్సిస్ ను అందించడం. వోడాఫోన్ ఇప్పుడు నాలుగు ఆల్ రౌండర్ ప్లాన్‌లను అందిస్తున్నది. వాటి యొక్క ధరలు వరుసగా రూ.39, రూ.49, రూ.79, మరియు రూ.95.

వోడాఫోన్ సర్కిల్‌

వోడాఫోన్ సర్కిల్‌

వోడాఫోన్ యొక్క రూ.39, రూ.79 ప్లాన్లు ఎంపిక చేసిన సర్కిల్‌లలో మాత్రమే లభిస్తుండగా రూ.49, రూ.79 ప్యాక్‌లను ప్రతి వోడాఫోన్ ప్రీపెయిడ్ చందాదారులు పొందవచ్చు. రూ .79 ఆల్ రౌండర్ ప్లాన్ వినియోగదారుకు రూ .64 పరిమిత టాక్ టైమ్ , 200MB డేటా మరియు వాయిస్ కాల్స్ సెకనుకు ఒక పైస చొప్పున వసూలు చేయబడతాయి. రూ.79 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. అలాగే రూ.49 ప్యాక్ వినియోగదారుడికి 100 ఎంబి డేటా, రూ .38 టాక్ టైమ్ ను 28 రోజుల వాలిడిటీకి అందిస్తుంది.

వోడాఫోన్ అపరిమిత కాంబో ప్లాన్ లు

వోడాఫోన్ అపరిమిత కాంబో ప్లాన్ లు

వోడాఫోన్ యొక్క అపరిమిత కాంబో ప్రణాళికలు అన్ని ప్రీపెయిడ్ చందాదారుల కోసం రూ.129 నుండి ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతి నెల 100 రూపాయలకు మించి ఖర్చు చేయకూడదనుకునేవారికి ఈ ఆల్ రౌండర్ రీఛార్జీలు చాలా బాగా ఉపయోగపడతాయి. రూ.95 ఆల్ రౌండర్ ప్యాక్ 56 రోజుల చెల్లుబాటుతో వచ్చినందున అలాంటి వినియోగదారులకు ఇది మంచి ఎంపిక.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone 95 All Rounder Prepaid Plan offers 56 days Validity and Rs 74 Talk Time

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X