DEC 1 నుండి టారిఫ్ ధరలను పెంచుతున్న వొడాఫోన్,ఎయిర్‌టెల్

|

వొడాఫోన్ ఐడియా సంస్థ 1 డిసెంబర్ 2019 నుండి దాని సుంకాల ధరలను సముచితంగా పెంచుతున్నట్లు తెలిపింది. సంస్థ యొక్క స్థూల రాబడి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతికూల తీర్పు కారణంగా వోడాఫోన్ 2019 Q 3లో రికార్డు స్థాయిలో 50,921 కోట్ల రూపాయలు నష్టాన్ని పొందిన తరువాత ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నది.

ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ గత వారం 28,450 కోట్ల రూపాయల భారీ త్రైమాసిక నష్టాన్ని నమోదు చేసింది. టెల్కో ఉనికిలో ఉన్నప్పటి నుండి ఇదే అత్యధికంగా నష్టపోవడం. వోడాఫోన్ ఐడియా క్యూ 2 FY20 కోసం రూ.50,921 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. అదనపు AGR బకాయిలు కారణంగా నష్టాలు పెరిగాయి. వీటి కారణంగా టెల్కోలకు సుంకాలను పెంచడం కంటే వేరే మార్గం లేకుండా ఉన్నాయి.

 

RS.9లకే అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తున్న వోడాఫోన్ సాచెట్ ప్యాక్‌లుRS.9లకే అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తున్న వోడాఫోన్ సాచెట్ ప్యాక్‌లు

వోడాఫోన్
 

మొబైల్ డేటా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతూనే ఉన్నప్పటికీ ఇండియాలో తమ మొబైల్ డేటా ఛార్జీలు ప్రపంచంలోనే చాలా చౌకైనవి అని వోడాఫోన్ తెలిపింది. టెలికాం రంగంలో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి కలిగి ఉందని వాటాదారులు గుర్తించారు. అందుకోసం తమ క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కార్యదర్శుల కమిటీ (CoS) దీనికి తగిన పరిష్కారం ధరల పెంపు ఒక్కటే అని వోడాఫోన్ నిర్ణయం తీసుకున్నారు.

 

తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలుతక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలు

వోడాఫోన్

అలాగే వోడాఫోన్ తీసుకున్న నిర్ణయం తరువాత భారతి ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో డిసెంబర్ 1, 2019 నుండి టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచాలన్న తన నిర్ణయం ప్రకటించింది. ఈ రెండు సంస్థల నుండి కేవలం ప్రకటన మాత్రమే వచ్చింది. టెల్కోలు రెండూ సుంకాలను ఎంత మొత్తంలో పెంచనున్నారో ఇంకా వివరాలు బయటకు రాలేదు. కాని విశ్లేషకులు కనీసం 35-40% పెంపును ఆశిస్తున్నారు.

 

Airtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లుAirtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు

ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా రెండూ Q2 FY20 లో రికార్డు స్థాయిలో నష్టాలను చవిచూసాయి. అందుకోసమే సుంకం ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రెండు టెల్కోలు రిలయన్స్ జియోతో గల పోటీను తట్టుకోవడానికి తమ సుంకాల ధరలను తగ్గించాయి. కాని ప్రస్తుతం ఆ సుంకాల ధరలతో మార్కెట్లో నిలబడటం అసాధ్యం కాబట్టి టెల్కోస్ ధరలను పెంచాలని నిర్ణయించుకుంది.

 

 

RS.200 రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రోజుకు 1.5GB డేటాను అందించే టెల్కోలుRS.200 రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రోజుకు 1.5GB డేటాను అందించే టెల్కోలు

వోడాఫోన్

ఏదేమైనా భారతదేశం అంతటా వోడాఫోన్ వినియోగదారులకు అద్భుతమైన మొబైల్ సేవలను అందించడం ద్వారా డిజిటల్ ఇండియా దృష్టిని సాకారం చేయడంలో తన పాత్రను పోషించాలన్న తన నిబద్ధతను సంస్థ పునరుద్ఘాటించింది. సంస్థ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం ద్వారా 300 మిలియన్లకు పైగా కస్టమర్ల అభివృద్ధిని సాధించింది.

 

 

BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్

స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌

ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ నుండి బేసిక్ సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ లు రూ.25 కన్నా తక్కువ ధర నుండి ప్రారంభమవుతాయి. భారతి ఎయిర్‌టెల్ రూ.23 స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఇది ఎటువంటి టాక్ టైమ్ లేదా డేటా ప్రయోజనాన్ని అందించదు. కానీ ఇది కస్టమర్ యొక్క సర్వీస్ యాక్సిస్ ను మరొక 28 రోజులపాటు పొడిగిస్తుంది. వోడాఫోన్ ఐడియా సర్వీస్ వాలిడిటీ ఎక్స్‌టెన్షన్ బెనిఫిట్‌ కోసం రూ.24 ఆల్-రౌండర్ ప్లాన్‌ను కలిగి ఉంది.

 

60వేల కోట్లు ప్రభుత్వనికి చెల్లించనున్న టెలికామ్ కంపెనీలు60వేల కోట్లు ప్రభుత్వనికి చెల్లించనున్న టెలికామ్ కంపెనీలు

వోడాఫోన్  ప్రీపెయిడ్ సాచెట్ ప్యాక్

ఇప్పుడు వోడాఫోన్ భారతదేశంలో కొత్త ప్రీపెయిడ్ సాచెట్ ప్రణాళికను ప్రారంభించింది. వొడాఫోన్ నుండి అత్యంత సరసమైన సాచెట్ ప్యాక్ రూ.9 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్యాక్ కింద మీకు ఒక రోజు చెల్లుబాటు లభిస్తుంది. రోమింగ్ కాల్‌లతో పాటు అపరిమిత స్థానిక మరియు జాతీయ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పాటు 100MB 3G / 4G డేటాను మరియు 100 స్థానిక మరియు జాతీయ SMSలను కూడా పొందువచ్చు. లైవ్ టీవీ స్ట్రీమింగ్ కోసం వోడాఫోన్ ప్లేకి యాక్సెస్ కూడా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone and Airtel Set To Increase Tariifs, Will Be Implemented From December 1St, 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X