Home
News

వోడాఫోన్ ప్లే వెబ్‌సైట్‌ను ప్రారంభించిన వోడాఫోన్: లైవ్ టీవీ,వీడియో ఆన్ డిమాండ్‌

టెలికాం పరిశ్రమలో ప్రస్తుతం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు వినియోగదారులకు నిర్ణయాత్మకమైన ఒక సమర్పణ ఉంది. ఇది కంటెంట్‌తో సంబంధం కలిగి ఉంటుంది. టెలికాం ఆపరేటర్లందరూ చందాదారులను ఆకర్షించడానికి వారి ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత చందాలను అందిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా దాని స్వంత ఆన్-డిమాండ్ వీడియో అప్లికేషన్ వోడాఫోన్ ప్లే కలిగి ఉంది, ఇప్పుడు మొబైల్ వెబ్‌సైట్ ద్వారా కంటెంట్‌ను అందించనుంది.

వీడియో కంటెంట్‌

మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజర్ ద్వారా క్యూరేటెడ్ ఆన్-డిమాండ్ వీడియో కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ప్లే మొబైల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అంటే వారు ఇకపై యాప్ ని డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ALTBalaji, HOOQ, ZEE5 వంటి మరిన్ని వివిధ కంటెంట్ ప్రొవైడర్ల నుండి చందాదారులకు సులభంగా వీడియో కంటెంట్ యాక్సిస్ ను అందిస్తాయి.

వొడాఫోన్ ప్లే కంటెంట్

భారతి ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ సర్వీస్ కు సభ్యత్వాన్ని అందిస్తుండగా, వొడాఫోన్ దాని స్వంత వోడాఫోన్ ప్లే అప్లికేషన్‌ను కలిగి ఉంది. గతంలో వొడాఫోన్ ప్లే కంటెంట్ వోడాఫోన్ ప్లే యాప్ నుండి మాత్రమే యాక్సిస్ చేయబడేది. అయితే ఇప్పుడు టెలికాం ఆపరేటర్ వెబ్‌లో కూడా చందాదారులు ఈ ఆన్-డిమాండ్ వీడియో కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి మొబైల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

వోడాఫోన్ ప్లే ఫీచర్స్

వోడాఫోన్ ప్లే యాప్ మరియు వెబ్‌సైట్ వొడాఫోన్ చందాదారుల కోసం ఆన్-డిమాండ్ వీడియో కంటెంట్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఇది బాలీవుడ్, హాలీవుడ్, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ఒరిజినల్స్, సినిమాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ టివి, వెబ్ సిరీస్ వంటి మరిన్నింటిని అందిస్తుంది. వోడాఫోన్ ప్లే యాప్ లయన్స్‌గేట్ ప్లే, సోనీలైవ్, Zee 5, ALT Balaji, Shemaroo Me, Sun NXT, ఈరోస్ నౌ, Hoichoi, హంగమా వంటి మరిన్ని కంటెంట్ ప్రొవైడర్ల నుండి కంటెంట్‌ను క్యూరేట్ చేస్తుంది. వోడాఫోన్ ప్లే యాప్ మొత్తం మీద 300లకు పైగా లైవ్ టివి ఛానెళ్లను చందాదారులకు అందిస్తుంది. అంతేకాకుండా క్రోమ్‌కాస్ట్ ద్వారా టీవీకి నేరుగా , టీవీ కార్యక్రమాల సమయాలను చూపించడం, వాల్యూమ్ మరియు బ్రైట్ నెస్ కోసం టచ్ నియంత్రణలు, లైవ్ టీవీలో పాజ్ చేసి ప్లే చేయడం, ఇష్టమైన కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లోకి డౌన్‌లోడ్ చేసి ప్రసారం చేయగల సామర్థ్యం వంటి కొన్ని ఇతర లక్షణాలను కూడా అప్లికేషన్ అందిస్తుంది.

వోడాఫోన్ ప్లే లైవ్ టీవీ ఛానెల్‌లు

వోడాఫోన్ ప్లే అప్లికేషన్ గురించి గమనించవలసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది చందాదారుల కోసం VOD కంటెంట్‌ను తీసుకురావడమే కాకుండా OTT కంటెంట్‌తో పాటు లైవ్ టివి ఛానెల్‌లను కూడా అందిస్తుంది. ఇలాంటి సమర్పణలతో భారతి ఎయిర్‌టెల్ టెలికం ఆపరేటర్ మాత్రమే అందిస్తోంది. వెబ్‌లో వోడాఫోన్ ప్లే పొందడం అంటే వోడాఫోన్ చందాదారులు తమ బ్రౌజర్‌లో లైవ్ టివి ఛానెల్‌లను ఆస్వాదించగలుగుతారు. ప్రస్తుతం చిన్న డిస్ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. దీని కోసం వోడాఫోన్ చందాదారులు అదనపు యాప్ ను డౌన్‌లోడ్ చేయనవసరం లేదు. అంతేకాకుండా వారు తమ ఫోన్‌లోని కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

వెబ్‌సైట్ లైవ్ టీవీ యాక్సెస్‌లో రిలయన్స్ జియో లాగింగ్

భారతదేశంలో బండిల్ కంటెంట్ ఆఫర్‌లను మరియు లైవ్ టివి మరియు ఆన్-డిమాండ్ కంటెంట్ సేవలను వెబ్‌లోకి తెచ్చిన మరియు అందించే ఉద్దేశ్యాన్ని నెరవేర్చిన మొట్టమొదటి టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో. టెల్కో లైవ్ టివి మరియు OTT ని అందించే కంటెంట్ వరుసగా జియో టివి మరియు జియో సినిమా. ఇప్పుడు JioCinema యాప్ వెబ్‌సైట్‌లోని రిలయన్స్ జియో వినియోగదారులకు కంటెంట్‌కు యాక్సిస్ ను ఇస్తుంది. అయితే రిలయన్స్ జియో లైవ్ TV కోసం వెబ్ యాక్సెస్‌ను ఇంకా పొందలేకపోయింది. అంటే ప్రస్తుతం రిలయన్స్ జియో చందాదారుల కోసం JioTV యాప్ కి వెబ్ ప్రత్యామ్నాయం లేదు.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వెబ్ వెర్షన్‌

మరో టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ కూడా ఇప్పుడు తన ఎక్స్‌స్ట్రీమ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇది ఆన్‌లైన్ OTT మరియు లైవ్ టివి కంటెంట్‌ను చందాదారులకు అందిస్తుంది. అంటే వోడాఫోన్ మరియు భారతి ఎయిర్‌టెల్ రెండు టెల్కోలు కేవలం ఒక యాప్ ద్వారా అందించడంతో పాటు వెబ్ ద్వారా లైవ్ టివి కంటెంట్ సర్వీస్ ను అందిస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Announced Vodafone Play Mobile Website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X