వొడాఫోన్ 28 రోజుల ప్లాన్, కేవలం 38 రూపాయలకే..

Written By:

దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వొడాఫోన్‌, ఓ స్పెషల్‌ వాయిస్‌, డేటా ప్యాక్‌ను అత్యంత తక్కువ ధరకే లాంచ్‌ చేసింది. మధ్యప్రదేశ్‌, చత్తీష్‌ఘడ్, బీహార్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వొడాఫోన్‌ చోటా ఛాంపియన్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

జియో 100జిబి డేటా ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.38తో రీచార్జి చేసుకుంటే..

వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.38తో రీచార్జి చేసుకుంటే వారికి 100 నిమిషాల కాల్స్, 100 ఎంబీ 3జీ/4జీ డేటా లభిస్తుంది. 3జీ/4జీ అందుబాటులో లేని సర్కిల్స్ కస్టమర్లకు 200 ఎంబీ 2జీ డేటా లభిస్తుంది.

వాలిడిటీ 28 రోజులు

ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించారు. ఈ ప్యాక్‌ను రిటెయిల్ ఔట్‌లెట్స్ ద్వారా పొందవచ్చని లేదంటే మై వొడాఫోన్ యాప్, వొడాఫోన్ వెబ్‌సైట్ లేదా ఇతర వాలెట్లు, రీచార్జి సైట్లలోనూ రీచార్జి చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

వొడాఫోన్‌ తన కొత్త ఫస్ట్‌ రీఛార్జ్‌ కూపన్‌..

ఇటీవలే వొడాఫోన్‌ తన కొత్త ఫస్ట్‌ రీఛార్జ్‌ కూపన్‌(ఎఫ్‌ఆర్‌సీ)ని రూ.496కు లాంచ్‌చేసింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలోని కొత్త వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

రూ.496 ప్లాన్‌, రిలయన్స్‌ జియో రూ.459 ప్లాన్‌కి గట్టి పోటీ..

వొడాఫోన్‌ తీసుకొచ్చిన రూ.496 ప్లాన్‌, రిలయన్స్‌ జియో రూ.459 ప్లాన్‌కి గట్టి పోటీగా ఉంది. దీంతో పాటు వొడాఫోన్‌ ఎఫ్‌ఆర్‌సీ 177 ప్లాన్‌ను లాంచ్‌చేసింది. దీని కింద 28 రోజలు పాటు 28జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone Chhota Champion Pack With Bundled Data, Calls Launched at Rs. 38 more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot