3జీ యుద్ధం.. దిగొచ్చిన వొడాఫోన్!

Posted By: Staff

3జీ యుద్ధం.. దిగొచ్చిన వొడాఫోన్!

 

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్ వొడాఫోన్ తమ పరధిలోని 3జీ టారిఫ్ ధరలను 80శాతం వరకు తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దింతో 3జీ టారిఫ్‌లను తగ్గించిన నాలుగో కంపెనీగా వొడాఫోన్ గుర్తింపుపొందింది. ఇప్పటికే ఈ టారిఫ్‌లను తగ్గించిన కంపెనీల జాబితాలో భారతి ఎయిర్‌టెల్, ఐడియా, ఆర్‌కామ్‌లు ఉన్నాయి.

తమ కంపెనీ 3జీ టారిఫ్‌లు రూ.25 నుంచి ప్రారంభమవుతాయని వొడాఫోన్ పేర్కొంది. రూ.25కు 25 ఎంబీ యూసేజిని, రూ.1,599కు 12 జీబీ డేటా యూసేజిని అందిస్తామని పేర్కొంది. ప్రి-పెయిడ్ కస్టమర్ల కోసం పే-యాజ్-యూ-గో స్కీమ్ కింద 10 కేబీ డేటాను 2 పైసలకే అందిస్తామని వివరించింది. రోమింగ్‌కు, డేటా యూసేజ్‌కు ఎలాంటి అదనపు చార్జీలుండవని వొడాఫోన్ విభాగం తెలిపింది.

స్పెక్ట్రమ్‌కు అధిక ధరను ట్రాయ్ ప్రతిపాదించిన నేపథ్యంలో 3జీ ధరల యుద్ధం జరుగుతోంది. 3జీ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.67,000 కోట్ల ఆదాయం వచ్చింది. స్పెక్ట్రమ్ వేలం కోసం పలు కంపెనీలు భారీగా రుణాలు చేసి, పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులు రాబట్టుకోవడం కోసం 3జీ టారిఫ్‌లను తగ్గించడం ద్వారా అధిక వ్యాపార అవకాశాలను చేజిక్కించుకోవడానికి కంపెనీలు టారిఫ్‌లను తగ్గిస్తున్నాయని నిపుణులంటున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot