ఇంటి వద్దకే వొడాఫోన్ సిమ్, ఆధార్ వెరిఫికేషన్‌

Posted By: BOMMU SIVANJANEYULU

తమ వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో వొడాఫోన్ ఇండియా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టుంది. ఆధార్ వెరిఫికేషన్‌తో పాటు సిమ్ అప్‌గ్రేడ్‌లను కస్టమర్ ఇంటివద్దకే వెళ్లి చేసేందుకు రెండు ప్రత్యేకమైన మొబైల్ వ్యాన్‌లను వొడాఫోన్ ఏర్పాటు చేసింది.

ఇంటి వద్దకే వొడాఫోన్ సిమ్, ఆధార్ వెరిఫికేషన్‌

ప్రస్తుతానికి ఈ సర్వీస్ రాజస్థాన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికి త్వరలోనే మిగిలిన రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది.

ఈ రెండు వ్యాన్‌లు గ్రామాలతో పాటు చిన్నచిన్న నగరాలను కవర్ చేస్తూ సర్వీసును అందిస్తాయి. వొడాఫోన్ ఈ మొబైల్ వ్యాన్ స్కీమ్‌ను జనవరి 2017లోనే ప్రారంభించింది. ఈ వ్యాన్‌ల ద్వారా ఇప్పటి వరకు రాజస్థాన్‌లోని 450కు పైగా గ్రామాలను కవర్ చేసినట్లు వొడాఫోన్ తెలిపింది.

ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురావటం ద్వారా గడిచిన 10 నెలలుగా వేలాది మంది కస్టమర్‌లు తమ వొడాఫోన్ సిమ్‌లను ఆధార్‌తో లింక్ చేసుకోగలిగారని వొడాఫోన్ రాజస్థాన్ బిజినెస్ హెడ్ అమిత్ బేడీ తెలిపారు.

ఐఫోన్ ఎస్ఈ 2పై గురిపెట్టిన ఆపిల్, అంతా సీక్రెట్ !

దేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా గుర్తింపు తెచ్చుకుని వొడాపోన్ తాజగా సూపర్ ఐఓటీ పేరుతో సరికొత్త సర్వీసులను లాంచ్ చేసింది. ఈ సర్వీసులో భాగంగా వెహికల్ ట్రాకింగ్, అసెట్ ట్రాకింగ్ (ఫిక్సుడ్ అండ్ మొబైల్), పీపుల్ ట్రాకింగ్ (స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయిస్) వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్‌ను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది.

English summary
The company has launched SuperIoT -comprising IoT solutions like Vehicle Tracking, Asset Tracking (Fixed and Mobile) and People Tracking.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot