వొడాఫోన్ కొత్త కోణం!!

Posted By: Super

వొడాఫోన్ కొత్త కోణం!!

 

దేశవ్యాప్తంగా 1000 పాఠశాలల్లోని విద్యార్థులకు లెర్నింగ్ సొల్యూషన్లను అందించడం కోసం ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వొడాఫోన్ ఫౌండేషన్ ప్రకటించింది. మూడేళ్లలో 1000 పాఠశాలలకు చెందిన 50 వేల మంది విద్యార్థులకు లెర్నింగ్ విత్ వొడాఫోన్ కింద లెర్నింగ్ సొల్యూషన్లు అందజేయాలని వొడాఫోన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మొబైల్ టెక్నాలజీపై గ్రాఫికల్ కంటెంట్‌తో లెర్నింగ్ సొల్యూషన్లను కంపెనీ రపొందించింది. మొబైల్ టెక్నాలజీతో విద్యార్థులను ఎలా తీర్చిదిద్దవచ్చో చెప్పడానికి ఈ సొల్యూషన్ స్పష్టమైన నిదర్శనం అని వొడాఫోన్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ లారా టర్కింగ్‌టన్ పేర్కొన్నారు.

వొడాఫోన్ బంపర్ టారిఫ్:

రాష్ట్ర చందాదారుల కోసం వొడాఫోన్ బంపర్ టారిఫ్ ను అందుదుబాటులోకి తెచ్చింది. ఎఫ్‌ఆర్‌సీ11, ఎఫ్‌ఆర్‌సీ57 పేరుతో రెండు రీచార్జ్ ప్లాన్లను ఈ లీడింగ్ టెలికం ప్రొవైడర్ ప్రవేశపెట్టింది. ఎఫ్‌ఆర్‌సీ11 కింద రూ.11తో తొలి రీచార్జ్, రూ.19తో రెండో రీచార్జ్ చేయిస్తే రూ. 60 విలువ చేసే టాక్‌టైమ్ లభిస్తుంది. నాలుగు నెలల పాటు (ప్రతి నెలా రూ. 15) ఇది వర్తిస్తుంది. అలాగే, 15 రోజుల పాటు 50 లోకల్/నేషనల్ ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. మరోవైపు, ఎఫ్‌ఆర్‌సీ57 కింద రూ. 57తో తొలి రీచార్జ్, రూ.3తో మలి రీచార్జ్ చేయిస్తే రూ.60 విలువ చేసే టాక్‌టైమ్ లభిస్తుంది. 3 నెలల పాటు (నెలకు రూ. 20) ఇది వర్తిస్తుంది. లోకల్ కాల్స్‌కి రెండు సెకన్లకు 1 పైసా చొప్పున ప్రత్యేక టారిఫ్ ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot