వొడాఫోన్ ఈ రెండు ప్లాన్లలో భారీ మార్పులు చేసింది, చెక్ చేసుకోండి

|

దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం ఒక్కసారిగా అనేక కుదుపులకు కారణం అయింది. అలాగే అనేక సంచలనాల ఫలితాలు నమోదయ్యాయి. డేటా ధరలు అప్పటివరకు ఆకాశంలో ఉంటే జియో వచ్చిన తరువాత నేల చూపులు చూశాయి. ముఖ్యంగా జియో ఉచిత డేటాతో ఓ సునామినే తలపించింది. దాని దెబ్బకు దిగ్గజ టెల్కోలు కూడా తమ డేటా ధరలను భారీగా తగ్గిస్తూ వస్తున్నాయి. తమ పాత ప్లాన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ కూడా తన ప్లాన్లలో మార్పులు చేసింది.

ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

అధిక డేటా
 

అధిక డేటా

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ రెండు ప్లాన్లలో మార్పులు చేసింది. నెల రోజుల ప్లాన్ రూ. 199, అలాగే 84 రోజుల ప్లాన్ రూ.399లో భారీ మార్పులను చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా అధిక డేటాను అందిస్తోంది.

రూ.199 ప్లాన్

రూ.199 ప్లాన్

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ ఇంతకు ముందు నెలరోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.4 జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్‌లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ నెల రోజుల పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 1.5జిబి డేటాను అందుకుంటారు.

రూ.399 ప్లాన్

రూ.399 ప్లాన్

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ నెల రోజుల పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 1.4జిబి డేటాను అందుకుంటారు.

కాల్ లిమిట్
 

కాల్ లిమిట్

ఈ రెండు ప్లాన్లు daily FUP limitతో వచ్చాయి. రోజుకు 250 నిమిషాలు అలాగే వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పరిధిని దాటి మీరు కాల్ చేస్తే సెకండ్ కి 1.2పైసా, నిమిషానికి రూపాయి ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. డేటా లిమిట్ దాటిన తర్వాత కూడా ఎంబికి 50 పైసల చొప్పున ఛార్జ్ చేస్తారు.

లేటెస్ట్ ప్లాన్

లేటెస్ట్ ప్లాన్

కాగా కంపెనీ ఈ మధ్య ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.169 ప్లాన్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ కింద యూజర్లు 28 రోజుల పాటు రోజుకు 1జిబి డేటా అలాగే అన్‌లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్ లు అందుకుంటారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone has revised Rs 199 and Rs 399 prepaid plans; here's what's more and what's less More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X