వోడాఫోన్ ఐడియా యూజర్‌లకు గుడ్‌న్యూస్.. 5G నెట్‌వర్క్‌పై కీలక సమాచారం..!
భారత్ లో ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు 5G నెట్‌వర్క్ ను అందిస్తున్నాయి. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో 5G సర్వీసులను అందిస్తోంది. మరో ప్రైవేటు టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) కూడా 5G నెట్‌వర్క్ కోసం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ముంబయిలో Vi 5G ట్రయల్స్ (Vodafone idea 5G) ప్రారంభించింది. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తొలుత ముంబయిలో :
ముంబయి అనంతరం ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ జాబితాలో ఇంకా చాలా ప్రాంతాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ నెలలోనే ముంబయిలో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

తర్వాత దశలో ఢిల్లీ, ఆగ్రా, పూణే, చెన్నై, అహ్మదాబాద్. కోల్‌కతా. లక్నో, హైదరాబాద్, జలందర్ వంటి ప్రాంతాల్లో వోడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మెట్రో నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3 వంటి ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
త్వరలో ఈ ప్రాంతాల్లో Vi 5G :
ఢిల్లీలోని ఓక్సా ఫేజ్ 2, ఇండియా గేట్, ప్రగతి మైదాన్, చెన్నైలోని నేసపక్కమ్, పెరంగుడి, పూణేలోని శివాజీ నగర్, జైపూర్ లోని గెలాక్సీ సినిమా, RIICO, అహ్మదాబాద్‌లోని దివ్య భాస్కర్, మకర్బా, ప్రహ్లాద్‌నగర్, కోల్‌కతాలోని సెక్టార్ 5, సాల్ట్ లేక్, హైదరాబాద్‌లోని ఐదా ఉప్పల్, రంగారెడ్డి, లక్నోలోని గోమతినగర్, విబ్దుతి ఖండ్ సహా ఆగ్రాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది.
వోడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్ ట్రయల్స్ సమయంలో ఎంపిక చేసిన యూజర్లకు 5G సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే దశలవారీగా ట్రయల్స్ నిర్వహణ సహా నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ముంబయి ట్రయల్స్ సమయంలో రూ.299 అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌లు కలిగిన ఎంపిక చేసిన యూజర్‌లకు 5G అందుబాటులోకి వచ్చింది.
వీటి కంటే తక్కువ ధరకే అందుబాటులోకి :
జియో, ఎయిర్‌టెల్ కంటే Vi 5G రీఛార్జ్ ప్లాన్‌లు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు నెట్‌వర్క్‌లతో పోలిస్తే 15 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 5G కనెక్టివిటీ లేకపోవడంతో అనేక మంది Vi యూజర్లు వేగవంతమైన డేటా కోసం ఎయిర్‌టెల్, జియోకు పోర్టింగ్ అయ్యారు.
ఇప్పటికే అధిక ప్రయోజనాలు అందిస్తున్న Vi :
ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే డేటా పరంగా వోడాఫోన్ ఐడియా అధికంగా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా డేటా పరంగా అనే ప్లాన్‌లు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. దీంతోపాటు వీకెండ్ డేటా సహా మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది.
జియో రూ.198 ప్లాన్ నుంచే 5G :
అయితే ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నాయి. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్‌లు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అయితే జియో రూ.198 రీఛార్జ్ నుంచే అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








