Vi యూజర్లకు గుడ్ న్యూస్!! ఉచిత ఆరోగ్య బీమా ప్రయోజనంతో ప్రీపెయిడ్ ప్లాన్‌లు..
వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క ప్రీపెయిడ్ వినియోగదారుల సంఖ్య తగ్గుతున్న సందర్బంగా ఉన్న వారిని కాపాడుకోవడానికి మరియు పోర్ట్ చేసుకున్న వారిని తిరిగి పొందడానికి హెల్త్ ఇన్సూరెన్సును ఉచితంగా అందిస్తున్నది. Vi టెల్కో ఆరోగ్య బీమా కవరేజీని అందించడానికి ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ABHI) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎంచుకున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొనుగోలుపై Vi వినియోగదారులు ఇప్పుడు ABHI యొక్క ఉచిత బీమా కవరేజీని పొందవచ్చు. టెల్కో ఈ ఆఫర్‌ను 'Vi హోస్పికేర్' అనే పేరుతో అందిస్తున్నది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.51 మరియు రూ.301 ధరల వద్ద లభించే రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు ఆరోగ్య బీమా ప్రయోజనంతో వస్తాయి. Vi వినియోగదారులు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై బీమా కవరేజీకి సంబందించిన మరిన్ని వివరాలు తెల్సుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా హాస్పికేర్ ఫీచర్స్
వోడాఫోన్ ఐడియా (Vi) హోస్పికేర్ ప్రయోజనంతో లభించే మొదటి వోచర్ రూ.51 ధర వద్ద లభిస్తుంది. ఇది వినియోగదారులకు 500 SMS లను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ లో వాయిస్ కాలింగ్ లేదా డేటా ప్రయోజనాలు వంటివి ఏమి లేవు. ఇది 28 రోజుల చెల్లుబాటుతో మాత్రమే లభిస్తుంది. ఏదైనా సాధారణ ఆసుపత్రి చికిత్సల కోసం వినియోగదారులు 1,000 రూపాయల వరకు భీమాను పొందటానికి అర్హులు.

Vi రూ.301 వోచర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఆరోగ్య ప్రయోజనాలతో లభించే రెండవ వోచర్ రూ.301 ధర వద్ద లభిస్తుంది. ఈ వోచర్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఫెయిల్-యూజ్-పాలసీ (FUP) డేటా పైన టెల్కో వోచర్‌తో 2GB బోనస్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు సాధారణ ఆసుపత్రి చికిత్సల కోసం రోజువారీ రూ.1,000 భీమా పొందవచ్చు.

Vi ప్రీపెయిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్
వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క బీమా ప్రయోజనాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకున్న వారు ఒకవేళ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చేరి ఉంటే కనుక బీమా మొత్తం రోజూ రూ.2,000 కు రెట్టింపు అవుతుంది. సంబంధిత వోచర్‌ల యొక్క ప్రతి విజయవంతమైన రీఛార్జిపై వినియోగదారుకు బీమా సౌకర్యం 28 రోజుల వరకు విస్తరిస్తుందని కంపెనీ తెలిపింది.

Vi హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు
వోడాఫోన్ ఐడియా (Vi) మరియు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ యొక్క నిబంధనలు మరియు షరతుల విషయానికి వస్తే భీమా కవరేజీని పొందడానికి వినియోగదారుడు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా ఈవెంట్ కోసం ఈ కవరేజ్ 10 రోజులు మాత్రమే అందించబడుతుంది.


Click it and Unblock the Notifications








