Home
News

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వోడాఫోన్‌ ఐడియా కొత్త ఆఫర్‌.. ఎన్నో ప్రయోజనాలు..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల జియో తమ ప్రీపెయిడ్‌ యూజర్లకు స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ ప్రకటించగా.. మరో టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (VI) కూడా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఆగస్టు 18 వరకు అందుబాటులో ఉంటుందని VI వెల్లడించింది.

స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌లో భాగంగా VI.. ధర రూ,199 కంటే ఎక్కువ రీఛార్జ్‌లపై అదనంగా 50GB డేటా ప్రయోజనాలను అందించనుంది. దీంతోపాటు వోడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ వినియోగదారులు రూ.1449 రీఛార్జ్‌పై రూ.50 మరియు రూ.3099 రీఛార్జ్‌పై రూ.75 తగ్గింపును పొందవచ్చని టెలికాం సంస్థ వెల్లడించింది.

Vodafone idea announces independence day offers

ఈ ఆఫర్లతోపాటు వోడాఫోన్‌ ఐడియా యాప్‌లో.. స్పిన్‌ ది వీల్‌ పేరిట పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలో భాగంగా ప్రతి గంటకు ఓ విజేతను ఎంపిక చేస్తామని తెలిపింది. విజేతకు సంవత్సరం పాటు కాలపరిమితి ఉండే రూ.3099 కాంప్లీమెంటరీ రీఛార్జ్‌ను అందిస్తామని తెలిపింది.

ఈ పోటీలో 1GB, 2GB డేటా వంటి అదనపు రివార్డులను కూడా పొందవచ్చని చెప్పింది. దీంతోపాటు SonyLiv సహా మరిన్ని ప్రయోజనాలు పొందుతారని తెలిపింది. వోడాఫోన్‌ ఐడియా వినియోగదారులు స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను పొందేందుకు VI యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

* ప్రముఖ టెలికాం సంస్థ జియో కూడా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను ప్రకటన చేసింది. ధర రూ.2,999 రీఛార్జ్‌ ప్లాన్‌తో రోజువారీ 2.5GB డేటా ప్రయోజనాలతోపాటు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, SMS ప్రయోజనాలు, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ సహా జియో ఇతర యాప్‌లను ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు.

ఈ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ ప్లాన్‌ 365 రోజుల కాలపరిమితిని కలిగి ఉంటుంది. అదనంగా Swiggyలో రూ.249 కొనుగోలుపై రూ.100 తగ్గింపును పొందుతారు. యాత్ర ద్వారా బుక్‌ చేసుకొనే విమానాల టికెట్లపై రూ.1500 వరకు తగ్గింపును పొందుతారు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తులు రూ.999 ఆర్డర్‌పై రూ.200 తగ్గింపును పొందుతారు. నెట్‌మెడ్స్‌లో రూ.999 విలువైన ఆర్డర్‌పై 20 శాతం తగ్గింపు వస్తుంది.

మరో ప్లాన్‌ రూ.2,545తో 336 రోజుల కాలపరిమితిని కలిగి ఉంటుంది. రోజువారీగా 1.5GB డేటాతోపాటు అపరిమిత కాలింగ్‌తో రోజుకు 100 SMSలతో వస్తుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సహా ఇతర ప్రయోజనాలున్నాయి. అర్హత కలిగిన సబ్‌స్రైబర్‌లకు అపరిమిత 5G డేటాను కూడా అందిస్తుంది.

ఈ రెండు జియో ప్లాన్‌లు కాకుండా రూ.349 ప్లాన్‌లోనూ రూ.2,999 ప్లాన్‌ అందించే చాలా ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇది 30 రోజుల మాత్రమే కాలపరిమితితో వస్తుంది. 75GB హైస్పీడ్‌ డేటాను పొందుతారు. అనంతరం 64 Kbps వేగంతో డేటాను పొందుతారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone idea announces independence day offers with additional benefits upto august 18
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X